Site icon HashtagU Telugu

Chhattisgarh : ఆఫీస్ కు లేటుగా వచ్చారని ఉద్యోగుల చేత గుంజీలు తీయించిన కలెక్టర్

Collector Gopal Varma Kawar

Collector Gopal Varma Kawar

ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధ జిల్లా(Kawardha district)లో ఓ వినూత్న ఘటన చోటు చేసుకుంది. అక్కడి జిల్లా కలెక్టర్ గోపాల్ వర్మ (Collector Gopal Varma) ప్రభుత్వ ఉద్యోగులకు తగిన గుణపాఠం చెప్పారు. సాధారణంగా స్కూల్స్‌లో విద్యార్థులు లేట్‌గా వస్తే ఉపాధ్యాయులు గుంజీలు తీయించడం మనం చూస్తుంటాం. అయితే కలెక్టర్ గోపాల్ వర్మ సైతం అదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగుల చేత గుంజీలు తీయించిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Crime: నంద్యాలలో బిచ్చగాడు దస్తగిరి హత్య.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..

కవార్ధ జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఉదయం 11 గంటల సమయంలో కలెక్టర్ గోపాల్ వర్మ హఠాత్తుగా వెళ్లారు. అయితే కార్యాలయంలో చాలామంది ఉద్యోగులు అప్పటికీ ఇంకా రాలేదని గుర్తించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లేటుగా వచ్చిన ఉద్యోగులను బయట నిలబెట్టి వారితో గుంజీలు తీయించారు. అంతే కాదు “మళ్లీ లేటుగా రాము” అని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు.

Fire Break : హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ కారణంగా

ఈ సంఘటనతో ఉద్యోగులు షాక్‌కు గురవ్వగా, కలెక్టర్ తీసుకున్న చర్యపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ సేవలో ఉన్నవారు సమయపాలన పాటించకపోతే ప్రజలకు దెబ్బతీసినట్టే అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించబోనన్న సంకేతాన్ని కలెక్టర్ గోపాల్ వర్మ ఈ చర్య ద్వారా ఇచ్చారు. ప్రభుత్వ వ్యవస్థపై విశ్వాసం పెంచాలంటే ఇటువంటి కఠిన నిర్ణయాలు అవసరమంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.