Site icon HashtagU Telugu

Iron Dome For Mosquitoes : దోమలను వెతికి చంపే ‘ఐరన్ డోమ్’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

Anand Mahindra Iron Dome For Mosquitoes

Iron Dome For Mosquitoes : సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే భారత పారిశ్రామిక దిగ్గజం ఎవరైనా ఉన్నారంటే.. అది ఆనంద్ మహీంద్రానే! ఆయన పోస్టులు నెటిజన్లలో ఆలోచన రేకెత్తించేలా క్రియేటివ్‌గా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.తాజాగా ఆనంద్ మహీంద్రా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇటీవల కాలంలో డెంగ్యూ కేసులు బాగా పెరిగాయి. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో డెంగీ మహమ్మారి చెలరేగుతోంది. ఈనేపథ్యంలో దోమలను చంపే ఓ పరికరానికి  సంబంధించిన  వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్‌ చేశారు. దాన్ని ఆయన ‘ఐరన్‌ డోమ్‌’గా అభివర్ణించారు. ఇది చిన్న సైజులో ఉండే లేజర్‌ ఆధారిత క్యానన్‌ లాంటి పరికరం. దీన్ని ఒక చైనీస్‌ ఇంజినీర్‌ తయారు చేశారు. ఈ పరికరం అటూఇటూ తిరుగుతూ దోమల భరతం పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసి అబ్బురపడిన ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ అకౌంటులో షేర్ చేశారు. ‘‘ముంబైలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి క్యానన్‌ను కొనేందుకు ప్రయత్నిస్తున్నాను. ఓ చైనీస్‌ వ్యక్తి దీన్ని తయారు చేశాడు. ఇది దోమలను వెతికి చంపేస్తుంది. మీ ఇంటికి ఇదొక ఐరన్‌డోమ్‌ లాంటిది’’ అని పోస్టులో ఆనంద్ మహీంద్రా(Iron Dome For Mosquitoes)  రాసుకొచ్చారు.

Also Read :Triple Talaq : మోడీ, యోగిలను పొగిడిందని భార్యకు ట్రిపుల్ తలాఖ్

ఈ పరికరానికి యాంటీ మిస్సైల్ డిఫెన్స్‌ సిస్టమ్‌ను పోలిన రాడార్ వ్యవస్థను అమర్చారు. చుట్టుపక్కల ఉన్న దోమలను ఇది చాలా వేగంగా గుర్తిస్తుంది. దీనిలో నుంచి వెలువడే లేజర్‌ పాయింటర్‌ దోమలను చంపేస్తుంది. ఈ వీడియోను మొట్టమొదటిసారిగా గత సంవత్సరం డిసెంబరులో చైనాకు చెందిన సోషల్ మీడియా వేదిక విబోలో పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి తన ఎలక్ట్రిక్‌ కారులోని రాడార్‌‌లో కొన్ని మార్పులు చేసి ఈ పరికరాన్ని తయారు చేయడం గమనార్హం.

Also Read :Nagarjuna : ‘ఎన్‌ కన్వెన్షన్‌’ కూల్చివేత.. హీరో నాగార్జున కీలక ప్రకటన