Site icon HashtagU Telugu

Viral News : హవ్వ.. ఢిల్లీ మెట్రోలో అందరూ చూస్తుండగా యువకుడి అసభ్య ప్రవర్తన…

A man indecent behavior in Delhi Metro police ready to take serious action

A man indecent behavior in Delhi Metro police ready to take serious action

ఢిల్లీ మెట్రోలో(Delhi Metro) ఒక యువకుడు మొబైల్ ఫోన్ చూస్తూ హస్తప్రయోగం చేస్తున్నట్లు ఉన్న ఓ వీడియో(Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఆ యువకుడు మొబైల్ ఫోన్‌లో ఏదో చూస్తూ ఢిల్లీ మెట్రోలో హస్తప్రయోగం(masturbation)చేస్తున్నట్లు కనిపిస్తోంది. అతను చేసిన ఈ పని వల్ల ఆ ట్రైన్(Train) లో అతని చుట్టూ ఉన్న ఇతర ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనను మరో ప్రయాణికుడు వీడియో తీశాడు. అతను అలా చేస్తుంటే ఇబ్బంది పడ్డారే తప్ప ఇదేంటని ఎవరూ నిలదీయలేదు. ఈ ఘటనపై ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ చీఫ్ స్వాతి మలివాల్ స్పందిస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ మెట్రోకు నోటీసు జారీ చేశారు.

దీనిపై స్వాతి మలివాల్ ట్వీట్ చేస్తూ.. ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తి సిగ్గులేకుండా హస్తప్రయోగం చేసుకుంటున్న వీడియో వైరల్ అయింది. ఇది పూర్తిగా అసహ్యకరమైనది మరియు అనారోగ్యకరమైనది. ఈ సిగ్గుమాలిన చర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు, ఢిల్లీ మెట్రోకు నోటీసులు జారీ చేస్తున్నాను అని తెలిపారు. DCW ఈ విషయంలో నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీని, మే 1 లోపు వివరణాత్మక చర్య తీసుకున్న నివేదికను ఇవ్వాలని కోరింది. పోలీసులు ఈ కేసు విషయంలో సుమోటోగా చర్యలు తీసుకున్నారని, ఐపిసి సెక్షన్ 294 (అశ్లీల చర్యలు) కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

DMRC కూడా తాజాగా చేసిన ట్వీట్ లో.. మెట్రోలో ఫ్లయింగ్ స్క్వాడ్‌ల మోహరింపును మరింత పెంచుతాము. మెట్రోలో ప్రయాణించేటప్పుడు తమను తాము బాధ్యతాయుతంగా నిర్వహించాలని మేము ప్రయాణికులను అభ్యర్థిస్తున్నాము. ఇతర ప్రయాణికులు ఏదైనా అభ్యంతరకరమైన ప్రవర్తనను గమనించినట్లయితే, వారు వెంటనే కారిడార్, స్టేషన్, సమయం మొదలైన వాటి వివరాలను DMRC హెల్ప్‌లైన్‌లో నివేదించాలి అని తెలిపింది.

 

Also Read :   Video Viral: కూతురి కోసం వీల్ చైర్ లో కూర్చొని డ్యాన్స్ .. గుండెల్ని పిండేస్తున్న వీడియో?