Tsunami Boy : అతడిని కొందరు ‘సునామీ బాయ్’ అని పిలుస్తారు. ఇంకొందరు ‘బేబీ81’ అని పిలుస్తారు. ఇంతకీ ఇతడు ఎవరు ? అతడి గురించి ఎందుకు చర్చ జరుగుతోంది. ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతి.. ఆయన జీవితపు ముఖ్య ఘట్టాలివీ
సునామీ బాయ్ కథ..
- 20 ఏళ్ల క్రితం.. 2004 డిసెంబరు 26న ఇండియా, శ్రీలంక, ఇండోనేషియాతో పాటు వివిధ దేశాల్లో సునామీ వచ్చింది.
- ఆ సునామీ వల్ల శ్రీలంకలో దాదాపు 35వేల మంది చనిపోయారు.
- సునామీ ప్రభావంతో శ్రీలంకలో ఎక్కడికక్కడ మట్టిదిబ్బలు(Tsunami Boy) ఏర్పడ్డాయి. వాటిలో రెండు నెలల చిన్నారి దొరికాడు.
- ఆ రెండు నెలల పసికందు మూడు రోజులుగా ఏమీ తినలేదని గుర్తించారు. అయినా అతడు బతకడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
- సునామీ టైంలో ఒక హాస్పిటల్‌లో ఎంతోమంది పేషెంట్స్ జాయిన్ అయ్యారు. ఈ బాబుకు 81వ నంబరును కేటాయించారు. దానివల్లే అతడిని బేబీ 81 అని పిలిచారు.
- ఆ పసికందును కొంతమంది.. సునామీ బాయ్ అని పిలిచారు.
- ఆ బాబు మావాడే అంటూ 9 ఫ్యామిలీలు వచ్చాయి. వారిలో అసలు పేరెంట్స్‌ను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.
- అయితే 8 కుటుంబాలు డుమ్మా కొట్టాయి. కేవలం మురుగుపిళ్లై జయరస కుటుంబం వచ్చింది. దీంతో ఆ కుటుంబానికే బేబీ81ను అప్పగించారు.
- చివరకు సునామీ బాయ్‌ను అతడి అసలైన పేరెంట్స్‌కు అప్పగించారు.
- సునామీ బాయ్‌కు .. అతడి పేరెంట్స్ జయరస అభిలాష్ అని నామకరణం చేశారు.
- బేబీ81 ఇప్పుడు 20 ఏళ్ల యువకుడిగా మారాడు.
- ఇటీవలే ఆ కుర్రాడు ఇంటర్ సెకండియర్ పూర్తి చేశాడు.
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సైంటిస్టుగా ఎదగాలని ఉందని బేబీ 81 జయరస అభిలాష్ అంటున్నాడు.
- ఇతడి గురించి ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.
- ఆనాడు సునామీ విష వలయం నుంచి బయటపడి బేబీ 81 ప్రాణాలు నిలవడం అనేది పెద్ద మిరాకిలే.