Zimbabwe : జింబాబ్వేలో డిపాజిట్ చేస్తే ఏడాదికే మూడింతలు.. ఎలా అంటే?

ప్రపంచంలోనే అత్యధిక వడ్డీ రేట్లు ఉన్న దేశం ఏది అనగానే మనకు జింబాబ్వే దేశం గుర్తుకువస్తుంది.

  • Written By:
  • Publish Date - June 28, 2022 / 06:00 AM IST

ప్రపంచంలోనే అత్యధిక వడ్డీ రేట్లు ఉన్న దేశం ఏది అనగానే మనకు జింబాబ్వే దేశం గుర్తుకువస్తుంది. పంచ వ్యాప్తంగా ఉన్న అత్యధిక వడ్డీ రేట్లు కలిగిన దేశంలో జింబాబ్వే దేశం కూడా ఒకటి. ఇకపోతే జింబాబ్వే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. జింబాబ్వే లోని సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేటును రెట్టింపు చేసి 190 శాతానికి చేర్చాలని అనుకుంటోంది ఇదే విషయాన్ని అక్కడి సెంట్రల్ బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ సభ్యుడు అయిన గ్వన్యాన్య తెలిపారు.

స్పెక్యులేషన్ ధోరణితో తీసుకుంటున్న రుణాలు దేశ కరెన్సీ విలువ పతనానికి కారణమవుతున్నాయని చెప్పారు. వాటిని నిరుత్సాహ పరిచేందుకే వడ్డీ రేట్లను పెంచాలని అనుకుంటున్నట్టు తెలిపారు. జింబాబ్వేలో ద్రవ్యోల్బణం జూన్ నెలకు 191.6 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో గ్వన్యాన్య మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవడంతో దీనికి సమాన స్థాయిలో వడ్డీ రేట్లను తీసుకెళ్లడంపై జింబాబ్వే సెంట్రల్ బ్యాంకు ఎంపీసీ ఈ వారం చివర్లో నిర్ణయాన్నీ ప్రకటించనుంది.

ఇకపోతే ప్రస్తుతం జింబాబ్వేలో కీలక రేటు 80 శాతంగా ఉంది. దీనికంటే తక్కువ రేటుకు రుణాలు ఇవ్వరాదంటూ జూన్ 17న తాము బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని కమిటీ సభ్యుడు గ్వన్యాన్య తెలిపారు. బుల్లెట్ ను విడిచి పెట్టాలని నిర్ణయించామని, దూకుడుగా వడ్డీ రేట్లను పెంచడం ద్వారా స్థిరత్వాన్ని సాధిస్తామని ప్రకటించారు. 190 శాతం వడ్డీ రేటు ప్రకారం రూ.10,000 డిపాజిట్ మొత్తం ఏడాది తర్వాత సుమారు రూ.29,000 అవుతుందని ఆయన తెలిపారు.