Zakir Naik Comments On Ladies: ఆడవారిపై ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ (Zakir Naik) హాట్ కామెంట్స్ చేసాడు. పెళ్లి కాని ప్రతి మహిళా… పబ్లిక్ సొత్తేనంటూ కీలక వ్యాఖ్యలు (Hot Comments) చేసారు జకీర్ నాయక్. నీకు ఆడాళ్లంటే అంత అలుసా? అంటూ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. నీ మతం… నీ సిద్దాంతం…నీకు ఇలాగే చెప్పమన్నాయా? అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆడవాళ్లను ఆదిపరాశక్తిగా పూజించే లోకం ఇది..! నీకున్న వివాదాలు సరిపోక..మహిళల్ని కించపరచడం అవసరమా…జకీర్?
ఇస్లాం మత (Islam) బోధకుడు జకీర్ నాయక్ ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ వస్తున్నారు. తరచూ ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. తాజాగా మహిళల గురించి చాలా దారుణంగా మాట్లాడి మరో వివాదానికి (Issue) తెరలేపారు. ఇంతకూ అతను మహిళల గురించి ఏమన్నారంటే.. ఒక మగాడికి వివాహమైనప్పటికీ మహిళలు అతడిని పెళ్లాడటం ఏమాత్రం తప్పు కాదనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు.
లేదంటే ఒకవేళ ఒక మహిళ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతే బజారు మనిషిలా (Road Side Ladies) మిగిలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా మహిళలను కించపర్చేలా మాట్లాడి జకీర్ నాయక్ (Zakir Naik) మరో వివాదానికి తెర తీశారు. గతంలో మనీ లాండరింగ్‌కు పాల్పడటంతోపాటు, ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో.. జకీర్ నాయక్‌పై భారత ప్రభుత్వం (India Govt) చర్యలకు సిద్దమైంది.
ఇస్లాం మతం.. ఒక పురుషుడు ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లాడేందుకు అనుమతిస్తుంది. అంటే అప్పటికే పెళ్లయి భార్య వున్న పురుషుడు మరో మహిళను ఇష్టపడవచ్చు. పెళ్లాడి సంతానాన్ని కూడా పొందవచ్చు. ఇదే విషయాన్ని గుర్తుచేసిన ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ ఈ సాంప్రదాయం తప్పేమీ కాదనేలా కామెంట్ చేశారు. పెళ్లికాని స్త్రీకి సమాజంలో గౌరవం లేదని నాయక్ పేర్కొన్నారు.
పెళ్లి చేసుకోడానికి అబ్బాయి దొరకకపోతే ఆ అమ్మాయి ముదు రెండు దారులు వుంటాయని, ఒకటి పెళ్లిచేసుకోకుండా మిగిలిపోవడం, రెండోది పెళ్లయిన వ్యక్తిని వివాహం చేసుకోవడమని జకీర్ నాయక్ అన్నారు. అయితే ఇందులో పెళ్లి చేసుకోకుండా వుండిపోవడం కంటే పెళ్లయిన వ్యక్తికి భార్యగా వెళ్లడమే మంచిదని వ్యాఖ్యానించారు. అలాంటి పెళ్లితో ఆమెకు గౌరవం పెరుగుతుందని జాకీర్ నాయక్ అన్నారు.