World Hepatitis Day-2023 : కాలేయం.. మన శరీరంలో ముఖ్యమైన అవయవం.
జీర్ణక్రియ సాఫీగా సాగాలన్నా.. వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా ఉండాలన్నా కాలేయమే ప్రధానం.
కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య గత కొన్నాళ్లుగా పెరుగుతోంది.
అందులోనూ ఎక్కువ మంది హెపటైటిస్ బాధితులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇవాళ వరల్డ్ హెపటైటిస్ డే (World Hepatitis Day-2023)..
ఈ సంవత్సరం “వరల్డ్ హెపటైటిస్ డే” థీమ్.. “ఒక జీవితం ఒకే కాలేయం”..
Also read : #BRO టాక్ : పవర్ స్టార్ సింగిల్ హ్యాండెడ్ పెర్ఫార్మెన్స్
5 రకాల హెపటైటిస్ వైరస్‌లు
“హెపటైటిస్” అంటే లివర్‌కు కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. హెపటైటిస్ వ్యాధి.. హెపటైటిస్ ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు రకాల వైరస్‌ల వల్ల వస్తుంది. వీటిలో ఏ, డీ, ఈ రకాల హెపటైటిస్ వైరస్ లు ప్రమాదకరమైనవి కావు. ఏ, డీ, ఈ రకాల హెపటైటిస్ వైరస్ లు కలుషిత ఆహారం, కలుషిత నీటిని తీసుకోవడం ద్వారా సోకుతాయి. పచ్చకామెర్లకు ఏ, డీ, ఈ రకాల హెపటైటిస్ వైరస్ లే కారణం. “హెపటైటిస్” బీ, సీ రకాల వైరస్ లు మాత్రం ప్రమాదకరమైనవి. ఇవి సోకితే త్వరగా కోలుకునే ఛాన్స్ ఉండదు. అయితే “హెపటైటిస్” బీ, సీ రకాల వైరస్ ల వల్ల సోకే ఇన్ఫెక్షన్లను ముందుగా గుర్తిస్తే కంట్రోల్ చేయొచ్చు. దీనిపై నిర్లక్ష్యం వహిస్తే లివర్ సిర్రోసిస్ దశకు చేరి ప్రాణ హాని కలుగుతుంది.
Also read : Star Symbol On Currency Note : స్టార్ సింబల్ ఉన్న నోట్లు నకిలీవి కావు..ఆర్‌బీఐ క్లారిటీ
హెపటైటిస్-బీ ఇలా సోకుతుంది..
హెపటైటిస్-బీ వైరస్ అనేది.. కలుషిత రక్తం, కలుషిత సిరంజీ, కలుషిత సూదులు, అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల సోకుతుంది. తల్లి నుంచి బిడ్డకు కూడా ఇది సంక్రమిస్తుంది. దీని బారినపడిన వారిలో 80 శాతం మందికి అసలు ఆ విషయం తెలియదు. హెపటైటిస్-బీని స్ర్కీనింగ్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు. హెపటైటిస్-బీ వైరస్ ను పదేళ్ల క్రితం 2005 జూలై 28న కనుగొన్నారు. నాటి నుంచి ఏటా అదేరోజున హెపటైటిస్ డేగా నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. 1960లలో హెపటైటిస్ బీని కనుగొనడంలో ఘనత వహించిన అమెరికన్ వైద్యుడు డాక్టర్ బరూచ్ శామ్యూల్ బ్లమ్‌బెర్గ్ పుట్టినరోజును పురస్కరించుకుని జులై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. హెపటైటిస్ బీ బాధితుల్లో 20 శాతం మంది లివర్ సిర్రోసిస్ వస్తుంది. అంటే కాలేయం పూర్తిగా దెబ్బతిని పనిచేయదు. ఈ దశ ప్రమాదకరమైనది. అక్కడ నుంచి వారిని ముందుకు వెళ్లకుండా ఆపేందుకు మాత్రమే మందులు ఉన్నాయి. ఈ వ్యాధితో బాధపడే వారిలో 2 శాతం మందికి లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. మన దేశ జనాభాలో ‘హెపటైటిస్ బి’ బాధితులు 3 నుంచి 5 శాతం మంది ఉన్నారు.
Also read : Rain Alert Today : తెలంగాణలోని 10 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు
హెపటైటిస్-సీ ఇలా సోకుతుంది..
ఇంట్లో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పచ్చకామెర్లతో ఇబ్బంది పడుతున్నా వారి నుంచి హెపటైటిస్-సీ సోకుతుంది. దీని బారినపడిన వారిలో 90 శాతం మంది లివర్ సిర్రోసిస్ దశకు వెళతారు. అయితే ఇందుకు 15 నుంచి 20 ఏళ్ల టైం పడుతుంది. దీర్ఘకాల మద్యపానం, కొన్నిరకాల మందుల వినియోగం, ఊబకాయం కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి.