Site icon HashtagU Telugu

WLL : అత్యధిక ESG రేటింగ్‌ను సాధించిన వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్

Welspun Living Limited achieved the highest ESG rating

Welspun Living Limited achieved the highest ESG rating

WLL : హోమ్ టెక్స్టైల్ విభాగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ ఆయిన వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ (WLL), సస్టైనబిలిటీలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంటూ , 2024 S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్ (CSA)లో మొత్తం ESG స్కోరు 83ని సాధించింది. ఈ గుర్తింపు టెక్స్టైల్ , అపెరల్ & లగ్జరీ గూడ్స్ విభాగంలో భారతదేశం నుండి అత్యున్నత ర్యాంక్ పొందిన టెక్స్టైల్ సంస్థగా వెల్‌స్పన్ యొక్క నాయకత్వాన్ని మరింత బలపరుస్తుంది. ఈ స్కోరు వెల్‌స్పన్ లివింగ్‌ను CSAలో ముందుగా పేర్కొన్న విభాగం లో ఈ ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉంచింది. ఈ కంపెనీ, 2023లో 66 స్కోర్ నుండి 26% మెరుగుదలతో 2024లో 83 స్కోర్ సాధించింది. ఇది పర్యావరణ అనుకూల వ్యాపార విధానాలు మరియు బాధ్యతాయుతమైన వృద్ధిపై దాని నిబద్ధతను స్పష్టంగా చూపిస్తుంది.

Read Also: Plane crash : అమెరికాలో మళ్లీ ఢీకొన్న విమానాలు.. ఇద్దరు మృతి

వెల్‌స్పన్ యొక్క అద్భుతమైన ప్రదర్శన మూల్యాంకనం యొక్క మూడు కీలక విభాగాలు – పాలన & ఆర్థికం (79), పర్యావరణం (85) మరియు సామాజిక (84)- లో ప్రతిబింబిస్తుంది. పర్యావరణ అనుకూల తయారీ పద్ధతులు , వనరుల సేకరణ లో నైతికత మరియు పర్యావరణ సారథ్యంలో కంపెనీ నిరంతర పురోగతులు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఆవిష్కరణ, పారదర్శకత, మరియు వృత్తాకార ఆర్థిక విధానాల పై వ్యూహాత్మక దృష్టితో వెల్‌స్పన్, సస్టైనబిలిటీని తన ప్రధాన వ్యాపార కార్యకలాపాల్లో సమగ్రంగా పొందుపరిచింది. వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ ESG ప్రదర్శనలో పరిశ్రమ ప్రమాణాలను అధిగమించింది. ఇది పర్యావరణంలో 85 (పరిశ్రమ సగటు: 34, అత్యధికం: 96), సామాజికంలో 84 (సగటు: 34, అత్యధికం: 91), మరియు పాలన & ఆర్థికంలో 79 (సగటు: 38, అత్యధికం: 88) స్కోర్ చేసింది. ఈ స్కోర్‌లు పరిశ్రమలో సస్టైనబిలిటీ మరియు శ్రేష్ఠతలో వెల్‌స్పన్ లివింగ్ నాయకత్వాన్ని వెల్లడిస్తాయి.

ఈ విజయంపై వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ ఎండి & సీఈఓ దీపాలి గోయెంకా మాట్లాడుతూ.. “ఈ సంవత్సరం ఎనభై మూడు స్కోరుతో S&P CSAలో టెక్స్టైల్ , అపెరల్ & లగ్జరీ గూడ్స్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానాన్ని సాధించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ విజయం మా మొత్తం బృందం యొక్క కృషి , అంకితభావానికి నిదర్శనం, వారు మా వ్యాపారంలోని ప్రతి అంశంలో పర్యావరణ అనుకూల వ్యాపార విధానాలను ఏకీకృతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. బాధ్యతాయుతమైన వృద్ధి అనేది ఆవిష్కరణ మరియు పారదర్శకతతో కలిసి ఉంటుందని వెల్‌స్పన్ లివింగ్‌ వద్ద మేము విశ్వసిస్తున్నాము. పర్యావరణ అనుకూల తయారీలో నాయకత్వం వహించడానికి , పరిశ్రమలో నూతన ప్రమాణాలను నిర్దేశించటానికి మేము కట్టుబడి ఉన్నాము” అని అన్నారు.

Read Also: Champions Trophy: ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. టీమిండియా ఖాతాలో మ‌రో చెత్త రికార్డు

Exit mobile version