Patanjali Affidavit In Supreme Court : లైసెన్స్ రద్దు అయిన 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశామని పతంజలి(Patanjali) ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టు(Supreme Court)లో అఫిడవిట్(Affidavit) దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 5,606 ఫ్రాంచైజీ స్టోర్లకు 14 ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పతంజలి మంగళవారం సుప్రీంకోర్టుకు అఫిడవిడ్ సమర్పించింది. ఈ ఉత్పత్తులను వెనక్కి పంపించాలని స్టోర్లకు సూచించినట్లు చెప్పింది. అదేవిధంగా లైసెన్స్ రద్దు అయిన ఈ 14 ఉత్పత్తులకు సంబంధించి ప్రకటనలు సైతం నిలిపివేయాలని పలు మీడియా సంస్థలకు తెలిపామని పతంజలి అఫిడవిట్‌లో పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరఖండ్ ప్రభుత్వం పతంజలి ఉత్పత్తుల లైసెన్స్‌లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆయా ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న తమ ఫ్రాంచైజీ స్టోర్లకు సూచించినట్లు తెలిపింది. మరోవైపు తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద లిమిటెట్ సంస్థ సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పతంజలి నకిలీ ప్రకటనల కేసు విషయంలో బాబా రాందేవ్, బాలకృష్ణ చెప్పిన క్షమాపణలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. పతంజలి సంస్థ తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చినట్లు నిర్ధరణ కావడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ సంస్థపై చర్యలు తీసుకుంది. ఆ సంస్థకు చెందిన 14 రకాల ఉత్పత్తులు, అనుబంధ విభాగం దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సును రద్దు చేసింది.
Read Also: Akhanda 2 Mokshagna Entry : అఖండ 2 మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా..?
దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆఫిడవిట్ దాఖలు చేయాలని పతంజలి ఆయుర్వేద సంస్థను ఆదేశించింది. దాంతో ఉత్తరాఖండ్ సర్కారు తయారీ లైసెన్స్‌లు రద్దు చేసిన ఆ 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపేశామని తెలుపుతూ పతంజలి ఆయుర్వేదిక్ సంస్థ అఫిడవిట్ దాఖలు చేసింది.
Read Also: Jagan : ఏపీలో జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం వేసింది – కేటీఆర్