Manoj Naravane : భారత్, పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై దేశవ్యాప్తంగా చర్చలు సాగుతున్న తరుణంలో, భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నరవణే, యుద్ధం అనేది ఆఖరి మార్గంగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, దౌత్యమే మొదటి ప్రాధాన్యతగా ఉండాలని స్పష్టం చేశారు.
Read Also: PV Narasimha Rao : ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పీవీ నరసింహరావు విగ్రహం
‘‘యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు. ఇది గాఢమైన విషయం. బాలీవుడ్ చిత్రం మాదిరి ఇందులో విజయం, గెలుపు అన్నవి తెరపై చూపించినట్లు ఉండవు. యుద్ధంలో నష్టపోయేది సామాన్య ప్రజలే. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వారు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. షెల్లింగ్ జరుగుతుంటే, చిన్నపిల్లలు రాత్రిళ్లు భయంతో సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు పెడతారు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబాలు తమకు ఇష్టమైన వారిని కోల్పోతే ఆ బాధ తరతరాలవారికి కలిసిరాదంటూ’’ నరవణే చెప్పారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఆయన, ‘‘ఇది ఒక మంచి ప్రారంభం. శాంతి దిశగా అడుగు వేయాల్సిన సమయం ఇదే ప్రధాని మోడీ అన్నారు. ఇది యుద్ధాల శకం కాదు. దౌత్యం, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి. యుద్ధం చివరి మార్గంగా మాత్రమే ఉండాలి. అవసరం ఉన్నా సైనికుడిగా నేను యుద్ధానికి సిద్ధమే. కానీ, శాంతియుత పరిష్కారమే నా మొదటి ఎంపిక’’ అని చెప్పారు. కొంతమంది యుద్ధం ఎందుకు జరగడం లేదని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో నరవణే స్పందిస్తూ, ‘‘తెలివితక్కువ నిర్ణయాల వల్ల దేశం యుద్ధంలోకి జారకూడదు. సమస్యలను పరిష్కరించేందుకు మేధస్సుతో ముందుకు వెళ్లాలి. బాలీవుడ్ మాదిరిగా ఇది రొమాంటిక్ గాథ కాదు. ఇది బాధాకరమైన, తీరని నష్టాలను తీసుకొచ్చే అంశం’’ అని హితవు పలికారు.
Read Also: Current charges : కరెంట్ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక వ్యాఖ్యలు