UP Cop Stealing Bulb: వీధి బల్బును దొంగిలించిన కానిస్టేబుల్.. పూర్ పోలీస్ అంటూ నెటిజన్స్ కామెంట్స్!

శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు ముందుంటారు. మరి అలాంటి పోలీసులు కంచె చేను మేసేవిధంగా వ్యవహరిస్తే ఏమనాలి?

  • Written By:
  • Updated On - October 15, 2022 / 04:46 PM IST

శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు ముందుంటారు. మరి అలాంటి పోలీసులు కంచె చేను మేసేవిధంగా వ్యవహరిస్తే ఏమనాలి? ఇదిగో ఈ కానిస్టేబుల్ ను చూపించాల్సిందే. ఉత్తరప్రదేశ్ లో విధి నిర్వహణలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఓ వీధిలోని బల్బును దొంగిలించాడు. ఎవరు లేని సమయంలో చేతివాటం ప్రదర్శించారు. ఎంచక్కా బల్బును దొంగిలించి వీధుల్లో నడుచుకుంటూ వెళ్లాడు. కానిస్టేబుల్ బల్బును దొంగిలించడంతో ఆ ప్రాంతంలో చిమ్మచీకట్లు అలుముకున్నాయి.

పాపం పూర్ కానిస్టేబుల్ భారతదేశంలో డెవలప్ మెంట్ అవుతుంది అనడానికి ఈ సంఘటన నిదర్శన అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలో కేవలం ఉత్తర ప్రదేశ్ లోనే ఎందుకు జరుగుతున్నాయి? అంటూ మరికొంత మంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.