BJP : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు రాజా సింగ్. ఈ టార్చర్ కంటే తాను బయటికి వెళ్లడమే కరెక్ట్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రాజాసింగ్ సొంత పార్టీ నేతల పైన ఫైర్ అయ్యారు. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ వ్యక్తికి ఇవ్వాలని సూచిస్తే ఎంఐఎం పార్టీతో తిరిగే నాయకుడికి ఇచ్చారని మండిపడ్డారు.
Read Also: Usain Bolt: ఉసేన్ బోల్ట్ రికార్డును బ్రేక్ చేసిన కుర్రాడు ఎవరు?
ఇదే విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే తనకు తెలియదని సమాధానమిచ్చారని, దీనిని బట్టి తనపై దాగి ఉన్న కుట్ర కోణం బయటపడిందని రాజాసింగ్ వివరించారు. తాను ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో యుద్ధం చేస్తూ వచ్చానని, కానీ, సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 2014లో తాను పార్టీలో చేరానని, అప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తాను అవసరం లేదని, వెళ్లిపోవాలని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాలని, కానీ, ఇలాంటి రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే బీజేపీ ఇక్కడ ఎప్పటికీ అధికారంలోకి రాదని రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని, కానీ, తన సూచనను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో సంజాయిషీ ఇవ్వాలని, అలాగే వెంటనే అధ్యక్షుడిని మార్చాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
Read Also: 26/11 Mumbai Attacks : తహవూర్ రాణా అప్పగింతకు ట్రంప్ అంగీకారం