Site icon HashtagU Telugu

Richest Persons : సంపన్నులు ఇష్టపడే ప్రదేశాలు ఇవే!

These Are The Places The Ri

These Are The Places The Ri

భారతదేశంలోని అత్యంత సంపన్నులలో (Richest Persons) 22 శాతం మంది విదేశాల్లో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారని కోటక్ ప్రైవేట్-ఈవై సర్వే (Kotak Private-KEY Survey)వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా (US), బ్రిటన్ (UK), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో నివాసం ఏర్పరచుకోవాలని అనుకుంటున్నారు. వీరి ప్రధాన లక్ష్యం హై క్వాలిటీ లైఫ్, బిజినెస్ చేసే అనుకూలమైన పరిస్థితులు, బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలు అని ఈ సర్వేలో వెల్లడైంది. బిజినెస్ గ్రోత్, ట్యాక్స్ ప్రయోజనాలు, గ్లోబల్ మార్కెట్‌లతో కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఈ వెసులుబాటు కోసం ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ కు జోడి గా కీర్తి సురేష్

సంపన్నులు విదేశాలకు వలస వెళ్లడానికి మరొక ప్రధాన కారణం వారి పిల్లలకు ఉత్తమ విద్యను అందించడం అని తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్న ప్రపంచస్థాయి యూనివర్సిటీలలో తమ పిల్లలు చదువుకోవాలనే కోరిక ఎక్కువగా ఉంది. అదనంగా ఆరోగ్య పరిరక్షణ, గ్రీన్ ఎన్విరాన్‌మెంట్, హై లైఫ్‌స్టైల్ వంటి అంశాలు కూడా వీరిని విదేశాల్లో స్థిరపడేందుకు ప్రేరేపిస్తున్నాయి. భారతదేశంలో బిజినెస్ చేసే కష్టతరమైన నిబంధనల వల్ల కొందరు వ్యాపారవేత్తలు ఇతర దేశాల్లో సంస్థలను ప్రారంభించడానికి మొగ్గు చూపుతున్నారు.

RC16 Title : రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే !

కానీ ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కొన్ని దుష్ప్రభావాలను కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో సంపన్నులు భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం తగ్గిపోతుంది. అంతేకాకుండా దేశీయ మార్కెట్‌లో టాలెంట్ బ్రెయిన్ డ్రైన్ కూడా జరగొచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ప్రపంచీకరణతో మిలియనీర్లు, బిలియనీర్లు తమ వ్యాపారాలు, జీవన విధానాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు ప్రయత్నించడం సహజమే అంటున్నారు. భారత ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల అనుకూలత, వ్యాపార సౌలభ్యం పెంచడం వంటి మార్గాల్లో మరింత ప్రయత్నం చేస్తే ఈ ట్రెండ్‌ను కొంతవరకు తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.