Supreme Court : తిరుమల లడ్డూపై దర్యాప్తుకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court : కల్తీ నెయ్యి విషయమై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలు గాయపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించాలని సెప్టెంబర్ 30 న జరిగిన విచారణలో కోర్టు తెలిపింది. ఏపీ పోలీసులు, సీబీఐ, FSSAI ప్రతినిధులతో కూడిన సిట్ దర్యాప్తు జరపాలని జస్టిస్ గవాయి తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Supreme Court has set up a special sit to investigate the Tirumala Laddu Row

Supreme Court has set up a special sit to investigate the Tirumala Laddu Row

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ గత ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వ నేతలు చేసిన ఆరోపణలతో తిరుపతి లడ్డూ వివాదాస్పదమైంది. నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆధారాల్లేకుండా బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పుబట్టిన న్యాయస్థానం ఈరోజు తదుపరి విచారణ చేపట్టింది. నేడు సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ పర్యవేక్షణలో ప్రత్యేక సిట్ బృందం దర్యాప్తు చేయాలని కోరింది. ఈ కేసును సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదు, కల్తీ జరిగిందని మీరు ఊహించనుకుంటున్నారా అని ప్రశ్నించింది. కల్తీ నెయ్యి విషయమై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలు గాయపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించాలని సెప్టెంబర్ 30 న జరిగిన విచారణలో కోర్టు తెలిపింది. ఏపీ పోలీసులు, సీబీఐ, FSSAI ప్రతినిధులతో కూడిన సిట్ దర్యాప్తు జరపాలని జస్టిస్ గవాయి తెలిపారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగితే బాగుంటుందని కోర్టు అభిప్రాయపడింది.

Read Also: RK Roja Reaction: సుప్రీంకోర్టు తీర్పుపై మ‌రోసారి స్పందించిన రోజా.. చంద్ర‌బాబే తొంద‌రుప‌డ్డారు..!

కోట్లాది మంది భక్తుల మనోభావాలు, నమ్మకాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సిట్ ఎలా ఉండాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే గవాయ్ సూచించారు. ఈ కమిటీలో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు అధికారులు ఉండాలి. మరో ఇద్దరు అధికారులు ఏపీ పోలీస్ శాఖ నుంచి ఉండాలి. ఒకరు FSSAI నుంచి ఉండాలి. ఈ కేసును టీటీడీ తరపున సిద్ధార్ధ లూథ్రా, ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదిస్తుండగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తున్నారు. రాజకీయంగా లడ్డూపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు సూచించింది.

ఈ మేరకు టీటీడీ తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. సుబ్రమణ్య స్వామి కోర్టుకు స్వయంగా తన వాదనలు వినిపించారు. ఇక కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత వాదనలు వినిపించారు. ఇక వైవీ సుబ్బారెడ్డి తరఫున కిపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం ఉందన్నారు. సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. అయితే, అందులో కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే సీఎం లడ్డూ కల్తీపై ప్రకటన ఎలా చేశారని ప్రశ్నించారు. వివాదం కోర్టులో ఉండగానే నిన్న కూడా ఒకరు ఇదే వివాదంపై మాట్లాడారని కొర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Read Also: Car Buyers: పాత కార్ల‌కు చెక్ పెట్టేందుకు కొత్త ఆఫ‌ర్‌.. ఏంటంటే..?

  Last Updated: 04 Oct 2024, 12:30 PM IST