Snakes Therapy : కొండ చిలువలు, బల్లులతో ట్రీట్మెంట్, మసాజ్

Snakes Therapy : పాములు, బల్లులు, తాబేళ్లు.. వీటిని కూడా వివిధ రోగాల ట్రీట్మెంట్ కు వాడుతున్నారు..వీటితోనూ దర్జాగా మసాజ్ లు చేస్తున్నారు.. ఈ థెరపీకి సరీసృపాలను వాడుతున్నందు వల్ల  దీన్ని రెప్టయిల్ థెరపీ అని పిలుస్తున్నారు. 

  • Written By:
  • Updated On - June 19, 2023 / 11:12 AM IST

Snakes Therapy : పాములు, బల్లులు, తాబేళ్లు.. 

వీటిని కూడా వివిధ రోగాల ట్రీట్మెంట్ కు వాడుతున్నారు..

వీటితోనూ దర్జాగా మసాజ్ లు చేస్తున్నారు.. 

ఈ థెరపీకి సరీసృపాలను వాడుతున్నందు వల్ల  దీన్ని రెప్టయిల్ థెరపీ అని పిలుస్తున్నారు. 

బ్రెజిల్‌లోని సావో పాలోలో ఉన్న “వాకింగ్ ఈకో థెరపీ” క్లినిక్‌.. రెప్టయిల్ థెరపీకి (Snakes Therapy) చాలా ఫేమస్. దాదాపు గత 10 ఏళ్లుగా ఈ క్లినిక్‌ ను గాబ్రియేల్ డి ఒలివేరా నిర్వహిస్తున్నారు. డాక్టర్స్ తమ మెడలో స్టెత స్కోప్ వేసుకొని హాస్పిటల్స్ లో తిరుగుతారు. కానీ “వాకింగ్ ఈకో థెరపీ” క్లినిక్‌ లో  గాబ్రియేల్ డి ఒలివేరా పసుపు, గోధుమ రంగు చారలున్న కొండ చిలువను తన మెడ చుట్టూ కండువాలా చుట్టుకొని తిరుగుతాడు. ఆటిజం, పక్షవాతం వంటి సమస్యలతో బాధపడుతూ తన దగ్గరికి వచ్చే వారికి.. పాములు, బల్లులు, తాబేళ్లతో ట్రీట్మెంట్ చేస్తాడు. అయినా గత 10 ఏళ్లలో చికిత్స చేసే క్రమంలో పాములు, బల్లులు, తాబేళ్ల  కారణంగా ఎన్నడూ ప్రమాదం జరగలేదని  వాకింగ్ ఈకో థెరపీ క్లినిక్‌ చెబుతోంది.

ట్రీట్మెంట్ లో ట్రిక్ ఇదీ.. 

“మనుషులు.. జంతువులు, సరీసృపాల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి సెరోటోనిన్, బీటా ఎండార్ఫిన్‌లను రిలీజ్ చేస్తాయి. సెరోటోనిన్, బీటా ఎండార్ఫిన్‌ అనేవి న్యూరో ట్రాన్స్‌మిటర్లు. సెరోటోనిన్ అనేది.. మెదడులోని నాడీ కణాల నుంచి అన్ని శరీర భాగాలకు సందేశాలను చేరవేసే కెమికల్. మానసిక స్థితి, నిద్ర, జీర్ణక్రియ, గాయం నయం కావడం, ఎముకల ఆరోగ్యం, రక్తం గడ్డకట్టడం, లైంగిక కోరిక వంటి శరీర పనితీరులలో సెరోటోనిన్ కీలక పాత్ర పోషిస్తుంది. బీటా-ఎండార్ఫిన్లు అనేది..  పిట్యూటరీ గ్రంధిలో ఉత్పత్తి అయ్యే పదార్ధం. ఇది మనకు నొప్పి కలిగే ఫీలింగ్ ను దూరం చేస్తుంది.  మనుషులకు ఏదైనా నొప్పి కలిగినప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు, ఒత్తిడులకు గురైనప్పుడు ప్రతిస్పందనగా బీటా-ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. మనుషులకు ఈ  చికిత్స చేసే క్రమంలో పాములు, బల్లులు, తాబేళ్ల నుంచి రిలీజ్ అయ్యే సెరోటోనిన్, బీటా ఎండార్ఫిన్‌లు ఎంతో ఉపశమనం కలిగిస్తాయి” అని  వాకింగ్ ఈకో థెరపీ క్లినిక్‌ నిర్వాహకులు వివరించారు.

Also read : 22 Snakes Caught: మహిళ బ్యాగ్ లో 22 పాములు.. వీడియో వైరల్

కొండ చిలువతో మసాజ్ 

34 ఏళ్ల పాలో పలాసియో శాంటోస్ కు ఒక ప్రమాదంలో మెదడుకు గాయాలయ్యాయి. దీంతో పక్షవాతం వచ్చి మాటలు రాని పరిస్థితి ఏర్పడింది. వాకింగ్ ఈకో థెరపీ క్లినిక్‌ కు ఆ రోగి రాగానే.. అతడి ముఖం నుంచి మెడ వరకు బాగా బలిసిన కొండ చిలువను చుట్టారు. దాని బరువు, చల్లని ఉష్ణోగ్రత వల్ల రోగి పలాసియో శాంటాస్ గొంతులోని గ్రంధుల పనితీరు రీ యాక్టివేట్ అవుతుందని క్లినిక్ నిర్వాహకులు చెప్పారు. కొండ చిలువ బరువు వల్ల మొహంపై , మెడపై ఏర్పడే ఒత్తిడి.. నోటి చుట్టూ ఉన్న కండరాలు తిరిగి బలాన్ని పుంజుకునేందుకు హెల్ప్ చేస్తుందని తెలిపారు.

Also read : Shocking News: పాతబస్తీలో దారుణం.. శవాలను మింగేస్తున్న పాములు!

జీవ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో.. 

“వాకింగ్ ఈకో థెరపీ” క్లినిక్‌ లో జరిగే చికిత్సలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. పరిసర ప్రాంత ప్రజలు వారి వ్యక్తిగత విశ్వాసంతో ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. ఈ క్లినిక్ లోని  పాములు, బల్లులు, తాబేళ్లను బ్రెజిల్ పర్యావరణ, జంతు పరిరక్షణ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. బ్రెజిల్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ క్లినిక్ లో ఒక జీవశాస్త్రవేత్త కూడా ఉద్యోగిగా ఉన్నారు. క్లినిక్ లోని జంతువులపై కలిగే ఒత్తిడి స్థాయిలను నిత్యం పర్యవేక్షించడం, వాటితో చికిత్స చేసే క్రమంలో రోగులు సురక్షితంగా ఉండేలా చేయడమే జీవశాస్త్రవేత్త బాధ్యత. గత 10 ఏళ్లలో పాములతో చికిత్స చేసే క్రమంలో ఎప్పుడూ ఈ క్లినిక్ లో ప్రమాదం జరగలేదని అంటున్నారు.ఈ క్లినిక్ లో విషపూరిత పాములను ఉపయోగించరు. చికిత్స చేసే క్రమంలో ఒకవేళ ఏదైనా జంతువు ఊహించని విధంగా ప్రతిస్పందిస్తే.. ఆపడానికి ఒక జీవశాస్త్రవేత్త అక్కడే ఉంటారు.