మయన్మార్(Myanmar)లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం (Earthquake ) ప్రపంచాన్ని వణికించిన నేపథ్యంలో హైదరాబాద్(Hyderabad)లో భూకంప భయం చర్చనీయాంశంగా మారింది. 7.7 తీవ్రతతో మాండలే ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప ప్రభావం దాదాపు 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకాక్ వరకు వెళ్లింది. హైదరాబాద్ వంటి అభివృద్ధి చెందిన నగరంలో ఇలాంటి ప్రకృతి విపత్తులు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. గతంలో ములుగు జిల్లాలో 5.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ప్రభావం కూడా హైదరాబాద్‌లో కొన్నిచోట్ల కనిపించింది. ఈ నేపథ్యంలో నగరంలోని భవన నిర్మాణాల భద్రతపై ప్రశ్నలు మొదలయ్యాయి.
CM Chandrababu : ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కార్యాచరణ: సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో ఎఫ్‌ఎస్‌ఐ (ఫ్లోరా స్పేస్ ఇండెక్స్) నిబంధనలను తొలగించిన తర్వాత అనేక హైరైజ్ బిల్డింగులు గచ్చిబౌలి, కోకాపేట, నానక్‌రామ్ గూడ వంటి ప్రాంతాల్లో పెరిగాయి. వీటిలో లక్షలాది మంది నివసిస్తున్నారు. కానీ ఈ టవర్ల భద్రత, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలు భవిష్యత్తులో సమస్యగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతస్థుల పరిమితి లేకుండా మంజూరైన నిర్మాణాలకు సంబంధించి భవన నిర్మాణ నిబంధనలు కచ్చితంగా పాటించాలనే సూచనలతో పాటు, ప్రకృతి విపత్తుల సమయంలో అపాయం తక్కువగా ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
Donald Trump Tariffs : ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చినా చైనా
భూకంప తీవ్రతను ఆధారంగా తీసుకుని దేశాన్ని విభజించిన భూకంప జోన్‌లలో హైదరాబాద్ జోన్-2లోకి వస్తుంది. ఇది భూకంప ప్రభావం తక్కువగా ఉండే ప్రాంతంగా పరిగణించబడుతుంది. సాధారణంగా ఇక్కడ 1–4 రిక్టర్ స్కేల్ మధ్య భూకంపాలే సంభవించే అవకాశముండి, పెద్దగా ముప్పు లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవనాల నిర్మాణ సమయంలో నిబంధనలు పాటిస్తే, భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు వచ్చినా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం ఉండకపోవచ్చని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ వాసులు ఆందోళన చెందకుండా, భద్రత ప్రమాణాల విషయంలో కచ్చితంగా ఉంటే సరిపోతుందని నిపుణుల సూచన.