Pak Citizens : పాకిస్థాన్ అట్టారీ-వాఘా సరిహద్దును మళ్లీ తెరిచింది. భారత్ నుంచి వస్తున్న తమ పౌరులు స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పిస్తూ వాఘా సరిహద్దు వద్ద గేట్లను శుక్రవారం ఉదయం తెరిచింది. గతనెల 30వ తేదీ తర్వాత పాక్ ఈ సరిహద్దును పూర్తిగా మూసేసింది. పహల్గాంలో దాడి తర్వాత పాక్‌పై దౌత్య చర్యల్లో భాగంగా ఆ దేశస్థులకు జారీ చేసిన స్వల్పకాలిక వీసాలను భారత్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
Read Also: Amaravati Relaunch : అమరావతి ప్రయోజనాలు తెలిస్తే వామ్మో అనకుండా ఉండలేరు !
కాగా, భారత్ మొత్తం మూడు రకాల వీసాల వారిని దేశం విడిచి వెళ్లిపొమ్మని ఆదేశించింది. కానీ, వీరికి ఉపశమనం ఇచ్చినట్లు గురువారం వార్తలు వచ్చినా.. అధికారిక సమాచారం ఏమీ లేదు. అయితే పాకిస్థాన్ వైఖరికి విరుద్ధంగా, భారత ప్రభుత్వం తదుపరి నోటీస్ జారీ చేసేవరకు అటారీ-వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా సరిహద్దును పాక్ తెరిచి తమ పౌరులను స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పించింది.
తమ దేశ పౌరులకు వీసాలు భారత్ హఠాత్తుగా రద్దు చేయడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంపై దృష్టిపెడతామని ఆ దేశ విదేశాంగశాఖ పేర్కొంది. ముఖ్యంగా మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకొంటున్నవారు మధ్యలో తిరిగి స్వదేశాలకు రావాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించింది. ఇక, భారత్ నుంచి 911 మంది పాక్ జాతీయులు స్వదేశానికి వెళ్లారు. ఆతర్వాత దాదాపు 24 గంటలపాటు పాకిస్థాన్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. దీంతో భారత్‌లో నిలిచిపోయినవారు తీవ్ర ఆందోళన చెందారు. తాజాగా ఆ సరిహద్దును తెరిచి.. తమ జాతీయులను వెనక్కి తీసుకొంటోంది.
Read Also: Amaravati : ఏపీలో మహోన్నత ఘట్టం..పెద్దఎత్తున రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్న ప్రజలు