Sex Toys Offer: రాజకీయ పార్టీ క్రేజీ ఆఫర్.. ఓటర్లకు ‘సెక్స్ టాయ్స్’

వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఓ రాజకీయ పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఇప్పుడు ఆ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.

Published By: HashtagU Telugu Desk
Sex Toys

Sex Toys

థాయ్‌లాండ్‌లోని ఓ రాజకీయ పార్టీ (Political Party) దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు సెక్స్ టాయ్‌లను (Sex Toys) చట్టబద్ధం చేస్తామని హామీ ఇచ్చి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే నెలలో థాయ్‌లాండ్‌ (Thailand) లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. థాయ్‌లాండ్‌లోని రాజకీయ పార్టీ అయిన కన్జర్వేటివ్ డెమొక్రాట్ పార్టీ సెక్స్ టాయ్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

రాచరిక డెమొక్రాట్ పార్టీ 1940ల నుండి థాయ్ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే అది 2019 ఎన్నికలలో పరాజయం పాలైంది. ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగుతోంది. “సెక్స్ టాయ్‌లు ఉపయోగకరం ఎందుకంటే అవి లైంగిక వాంఛ, లైంగిక (Sexual) సంబంధిత నేరాల తగ్గడంతో పాటు విడాకుల (Divorce) సంఖ్య కూడా తగ్గుతుంది ” అని పార్టీ ప్రతినిధి రచ్చడ థానాడిరెక్ ఒక ప్రకటనలో తెలిపారు. సెక్స్ టాయ్‌లను చట్టబద్ధం చేయడం వల్ల లైంగిక నేరాల రేటు, విదేశాల నుండి అక్రమంగా మానవ రవాణా తగ్గించడంలో సహాయపడుతుందని, ఇతర అనారోగ్య ఇన్‌ఫెక్షన్లు సైతం తగ్గుతాయని వాదించారు.

“వైద్య కోణంలో చూస్తే వైద్యులు (Doctors) సెక్స్ సర్వీస్‌ను కొనుగోలు చేయడానికి లేదా భాగస్వాములను మోసం చేయడానికి బదులుగా సెక్స్ టాయ్‌లు సిఫార్సు చేస్తున్నారు” అని థానాడిరెక్ అన్నారు. 40-80 సంవత్సరాల వయస్సు గల భారత పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. థాయ్‌లాండ్ క్రిమినల్ కోడ్ సెక్షన్ 287 ప్రకారం “అశ్లీలమైనది”గా పరిగణించబడే సెక్స్ టాయ్‌ల విక్రయాన్ని నేరంగా పరిగణించాలని అక్కడి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సెక్స్ టాయ్‌లను తయారు చేసే, బహిరంగంగా పంపిణీ చేసే లేదా విక్రయించే వారికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, ఆరు వేల భాట్ (సుమారు $175) జరిమానా లేదా రెండూ విధించబడతాయి. అయినప్పటికీ బ్యాంకాక్‌లోని కొన్ని తక్కువ విలువైన జిల్లాల్లో వీధి స్టాల్స్‌లో అవి ఉచితంగా లభిస్తాయి. ప్రస్తుతం ఈ రాజకీయ పార్టీ చేసిన సంచలన ప్రకటన హట్ టాపిక్ గా మారింది.

Also Read: Gangi Reddy: బ్రేకింగ్.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు!

  Last Updated: 27 Apr 2023, 12:50 PM IST