Moon: చంద్రుడిని రాకెట్ ఢీ కొడితే ఏం జరుగుతుందో తెలుసా.. నాసా చెప్పిన విషయాలివే!

ఈ అనంత విశ్వంలో ఎన్నో రహస్యాలు ఇంత లో దాగి ఉన్నాయి. రోజుకి ఒక విషయం వెలుగులోకి వస్తున్నప్పటికీ ఇంకా కనుగొనవలసిన విషయాలు చాలా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - June 29, 2022 / 06:30 PM IST

ఈ అనంత విశ్వంలో ఎన్నో రహస్యాలు ఇంత లో దాగి ఉన్నాయి. రోజుకి ఒక విషయం వెలుగులోకి వస్తున్నప్పటికీ ఇంకా కనుగొనవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇకపోతే ఈ అంతరిక్షంలో ఉన్న గ్రహాల గురించి తెలుసుకోవాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. అందుకోసం నిత్యం ఇలా అంతరిక్షానికి సంబంధించిన వస్తున్న వార్తలను ఫాలో అవుతూ ఉంటారు. చంద్రుడు లేదా చందమామ ను ఒక రాకెట్ ఢీ కొడితే ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? తాజాగా ఇదే ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు చేశారు. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించిన తరువాత విడివడిన రాకెట్ భాగము ఇటీవల చందమామను ఢీ కొట్టింది.

ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు ముందే గుర్తించినప్పటికీ ఆ రాకెట్ చంద్రుడిని ఢీకొట్టిన ప్రదేశాన్ని తాజాగా నాసాకు చెందిన లూనార్ రీకన్సీసన్స్ ఆర్బిటర్ గుర్తించింది. ఆ ప్రాంతాన్ని చిత్రీకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాసా తాజాగా విడుదల చేసింది. అదే ప్రాంతానికి సంబంధించిన పాత చిత్రాన్ని, తాజా చిత్రాన్ని పోల్చుతూ పలు వివరాలను వెల్లడించింది. కాకపోతే ఆ రాకెట్ ఎవరిదా అన్న విషయానికి వస్తే..ఓ రాకెట్ భాగం చంద్రుడివైపు దూసుకెళ్తున్నట్టు నాసా శాస్త్రవేత్తలు ఈ ఏడాది జనవరిలోనే గుర్తించారు. కొంతకాలం దాన్ని ట్రాక్ చేశారు. అది మార్చి 4వ తేదీన చంద్రుడిపై గుర్తు తెలియని ప్రదేశంలో ఢీకొట్టింది.

ఆ రాకెట్ భాగం దాదాపు ఏడాది కింద ఉప గ్రహ ప్రయోగానికి వాడినదని అంచనా వేశారు. అయితే అది చైనా ప్రయోగించిన రాకెటా, అమెరికా ప్రయోగించిన రాకెటా అనేది తెలియడం లేదు. అయితే ఆ రాకెట్ భాగం చంద్రుడిని ఢీకొట్టినప్పుడు పైకి ఎగిరి పడి ఉంటుందని. దీనితో ఒకదానికొకటి ఆనుకుని రెండు గుంతలు పడ్డాయని నాసా పేర్కొంది. 18 మీటర్ల వెడల్పుతో ఒక గుంత, 16 మీటర్ల వెడల్పుతో మరో గుంత ఏర్పడినట్టు తెలిపింది. మనుషులు ప్రయోగించిన రాకెట్లు ఇలా భూమి నుంచి దూరంగా వెళ్లి చంద్రుడిని ఢీకొట్టడం ఇదే మొదటిసారి అని నాసా తెలిపింది.