46000 Years Old Insects : ఆ పురుగులు మళ్ళీ బతికాయి..
ఒక సంవత్సరం కాదు.. రెండు సంవత్సరాలు కాదు..
ఏకంగా 46వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ వాటిలోకి జీవం వచ్చింది..
ప్లీస్టోసీన్ యుగం నాటి నులి పురుగుల పునర్జన్మ వ్యవహారం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది..
ఇన్నేళ్లుగా గాఢ నిద్రలో ఉన్న ఆ పురుగులపై.. వాటి సుదీర్ఘ ఆయుష్షుపై, ఆకలి నియంత్రణపై శాస్త్ర వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also read : Russia: ఉక్రెయిన్ తో కాల్పుల విరమణ గురించి స్పందించిన పుతిన్?
నెమటోడ్ జాతికి చెందిన నులి పురుగులు అవి. రాతి యుగం టైంలో రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఆ నులి పురుగులు జీవించాయి. వీటి హైట్ ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ ఉంటుంది. సాధారణంగా అయితే ఈ నులి పురుగులు 20 నుంచి 60 రోజులు జీవిస్తాయి. కానీ రాతియుగంలో ఒకానొక దశలో అవి “క్రిప్టోబయోసిస్” అని పిలువబడే నిద్రాణస్థితికి చేరుకున్నాయి. నాటి (46వేల సంవత్సరాల) నుంచి అవి నిద్రమత్తులోనే ఉన్నాయి. ఈ నులి పురుగుల శిలాజాలను 2018 సంవత్సరంలో రష్యన్ శాస్త్రవేత్తలు సైబీరియాలోని కోలిమా నది సమీపంలో ఉన్న లోతైన మంచు నిక్షేపం లోపల కనుగొన్నారు. అయితే అప్పట్లో వాటి గురించి పెద్దగా వివరాలు గుర్తించలేకపోయారు.
Also read : Tomato Prices: ప్రజలను కంటతడి పెట్టిస్తున్న టమాట.. అలాంటి వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ?
తాజాగా జర్మనీలోని డ్రెస్డెన్‌లో ఉన్న మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ సెల్ బయాలజీ (MPI-CBG)కి చెందిన ప్రొఫెసర్ టెమురాస్ కుర్జ్‌చాలియా నేతృత్వంలోని శాస్త్రవేత్తల టీమ్ దీనిపై ఫోకస్ పెట్టింది. 2018లో రష్యాలో లభ్యమైన నులి పురుగుల శిలాజాలపై ముమ్మర రీసెర్చ్ చేసింది. దీంతో అవి “క్రిప్టో బయోసిస్” అనే నిద్రాణస్థితికి చేరాయని తేలింది. ఆ నులి పురుగుల శిలాజాలను ల్యాబ్ లో టెస్ట్ చేశారు. వాటిని తిరిగి బతికించేందుకు ప్రయత్నం చేశారు. అయితే ప్రయోగం తొలి విడతలో ఆ అరుదైన నులి పురుగుల శిలాజాలలో చాలా వరకు నశించిపోయాయి. అయితే శిలాజంగా మారిపోయిన ఆ నులి పురుగుల్లో కొన్ని ఇటీవల మళ్ళీ బతికాయి. ల్యాబ్ లోని టెస్టింగ్ ట్యూబ్ లో అటూ ఇటూ కదలడం మొదలుపెట్టాయి. ఈ నులి పురుగుల శిలాజాలకు రేడియోకార్బన్ డేటింగ్ చేయగా.. వాటి వయసు 46వేల సంవత్సరాలని(46000 Years Old Insects) వెల్లడైంది.
Also read : AP Politics: సినిమాలో పొలిటికల్ డైలాగ్స్.. పాలిటిక్స్ లో సినిమా డైలాగ్స్