Site icon HashtagU Telugu

Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు మృతి

Massive encounter in Chhattisgarh..Five Maoists killed

Massive encounter in Chhattisgarh..Five Maoists killed

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న మాద్ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. అంతేకాక మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరు జవాన్లకు సైతం తీవ్ర గాయాలు అయ్యాయి. టేకుమేట, కాకూర్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఇటీవల కాలంలో వరుసగా ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు ఘటనతో మరోసారి ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కంకేర్ నక్సలైట్ ఎన్‌కౌంటర్‌లో చాలా మంది నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇక ఈ ఎన్‌కౌంటర్‌ను పోలీసు సూపరింటెండెంట్ ఐకె ఎలిసెలా ధృవీకరించారు.

మరోవైపు ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతుండగా, మరింత సమాచారం అందే అవకాశం ఉంది. ఇప్పటికే అక్టోబర్ 4న ఛత్తీస్‌గఢ్‌లో అబుజ్మద్ అడవుల్లో నక్సలైట్లపై చేపట్టిన పెద్ద ఆపరేషన్‌లో 31 మంది నక్సలైట్లు మరణించినట్లు తెలిసింది. అయితే అక్టోబర్ 14న, మావోయిస్టుల ప్రెస్ నోట్‌లో ఈ సంఖ్య 35కి పెరిగినట్లు వెల్లడైంది. ఆ తరువాత, అక్టోబర్ 18న, బస్తర్ ఐజి సుందర్‌రాజ్ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 38 మంది నక్సలైట్లు మరణించారని వెల్లడించారు.

Read Also: Ramamurthy Naidu : సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత