CM Revanth Reddy : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గుట్టలను మట్టిచేసే భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్…. గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడని ట్విటర్ వేదికగా కేటీఆర్ విమర్శించారు. గాలిమోటర్లలో మూటలు మోసుడు కాదు..కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడాలన్నారు. ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు..పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడుమన్నారు. నీ కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదు..ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడాలని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
నీ మూసి ముసుగులు కాదు..కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడలని విమర్శించారు. పొద్దు, మాపు ఢిల్లీ యాత్రలు కాదు..పల్లె పల్లెల్లో, వాడ వాడల్లో వడ్లు కొనండి మొర్రో అంటూ మొత్తుకుంటున్న రైతు ఆవేదన వైపు చూడాలన్నారు. నీ కాసుల కక్కుర్తి..నీ కేసుల కుట్రలు కాదు..పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక కకావికలం అవుతున్న రైతు బతుకు వైపు చూడమన్నారు. దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొడితివి..సన్నవడ్లకు సున్నం పెడితివి.. ఎగ్గొట్టడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు ఆసరాగా నిలవడం వైపు చూడాలని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు.
గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్ – గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడు
గాలిమోటర్లో మూటలు మోసుడు కాదు – కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు
ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు – పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడు
నీ… pic.twitter.com/2tRcMb5A9A
— KTR (@KTRBRS) November 6, 2024
అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది బీఆర్‌ఎస్ అని రేవంత్‌రెడ్డికీ తెలుసని, తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతికార చర్యలంటూ పిచ్చి ఆలోచనలు చేయలేదని, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టామని కేటీఆర్ చెప్పారు. గతంలో బంగారం, బ్యాంకు డిపాజిట్లు చేసే వర్గాలు భూమి మీద పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాయని, ఇప్పుడు ఆ వర్గాల వాళ్లంతా ఆందోళన చెందుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఆ పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, నల్లగొండలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముందు కొందరు నాయకులు అసహనం వ్యక్తం చేశారన్నారు. రియల్టర్ల ఇబ్బందులపై అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. రెరాను సంప్రదిస్తూ లీగల్ ఓపినియన్ తీసుకొని రియల్టర్ల ఫోరం మరింత బలపడాలని కేటీఆర్ సూచించారు.