KTR : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తెలంగాణ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్‌ఎస్ నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనే అంశంపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దు అంటూ కేటీఆర్ ప్రకటన చేశారు. ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దని వెల్లడించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌కు బలం లేదు కాబట్టే అభ్యర్థిని పోటీలో పెట్టలేదని చెప్పారు. ఎన్నికకు హాజరు కావద్దని పార్టీ తరఫున విప్ కూడా జారీ చేస్తామని చెప్పారు.
Read Also: Africa : భారత్‌కు రానున్న మరో 8 చిరుతలు
ఓటు ఉన్న వాళ్లకు విప్ ఇవ్వాలని తలసాని, సబిత ఇంద్రారెడ్డి లను కేటీఆర్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, కార్పొరేటర్లు ఎవరూ ఓటు కు వెళ్లొద్దని హెచ్చరించారు. ఎవరైనా విప్ ధిక్కరించి ఓటింగ్ కు వెళితే వారిపై చర్యలు ఉంటాయని కేటీఆర్ తెలిపారు. ఎంఐఎం, బీజేపీ రెండు పార్టీలతో సంబంధం లేదని కాబట్టి ఎవరికీ ఓటువేయవద్దని చెప్పారు. ఆ రెండు పార్టీల నేతలు ఒకటే అని అన్నారు. రేవంత్ రెడ్డికి బీజేపీ నేతలే రక్షణ కవచాలని వ్యాఖ్యానించారు. ఎనిమిది బీజేపీ ఎంపీలు ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించరని అన్నారు. ఉదయం లేస్తే కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను విమర్శిస్తారని చెప్పారు. తెలంగాణకు బీజేపీ ఎంపీ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు.
తెలంగాణలో బీజేపీకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారని ఒకరు సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయ మంత్రి అంటూ విమర్శలు గుప్పించారు. ఇక, హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
Read Also: Summer Dresses : సమ్మర్లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే?