KL : ఉమ్మడి పరిశోధన మరియు విద్యా మార్పిడి కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విద్యా సహకారానికి తమ నిబద్ధతను మరింతగా పెంచుకుంటూ కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, యుఎస్ఏ లోని వేన్ స్టేట్ యూనివర్సిటీతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. ఈ ఒప్పందం అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో మరియు విద్యార్థులు, అధ్యాపకులకు విద్యా అవకాశాలను పెంచడంలో మరో ముందడుగును సూచిస్తుంది.
Read Also: SC Classification : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
విద్యా నైపుణ్యం మరియు పరిశోధన సహకారం కోసం ఉమ్మడి దృక్పథాన్ని బలోపేతం చేస్తూ, కెఎల్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ , వేన్ స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధుల మధ్య ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మెకానికల్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ నబిల్ చల్హౌబ్ మరియు వేన్ స్టేట్ యూనివర్శిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ లీలా మోహన్ రెడ్డి కూడా విద్యా వృద్ధి , ఆవిష్కరణలకు పరస్పర అవకాశాలను అన్వేషించడానికి చర్చలలో పాల్గొన్నారు.
ఈ భాగస్వామ్యం రెండు విశ్వవిద్యాలయాలలోని విద్యార్థులకు విద్యా అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు సంస్థల మధ్య బలమైన సంబంధాన్ని పెంపొందించడానికి రూపొందించబడింది. ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు మరియు విద్యా మార్పిడిలలో పాల్గొనడం ద్వారా, విద్యార్థులు తమ తమ రంగాలలో విలువైన నైపుణ్యాలు , జ్ఞానాన్ని పొంది, ప్రపంచ కెరీర్ అవకాశాలకు సన్నద్ధం కాగలరు. అదనంగా, కెఎల్ విద్యార్థులు వేన్ స్టేట్ యూనివర్సిటీలో తమ చదువును కొనసాగించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా, వేన్ స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులు కెఎల్ యూనివర్సిటీలో విద్యా మార్పిడి కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఈ భాగస్వామ్యం కోసం రెండు సంస్థలు కార్యాచరణను ఖరారు చేశాయి, ఇది వచ్చే సెమిస్టర్ నుండి అమలు చేయబడుతుందని భావిస్తున్నారు.
ఈ సందర్శన మా అధ్యాపకులు మరియు విద్యార్థుల పరిశోధన సామర్థ్యాలను, మేధో వృద్ధిని గణనీయంగా సుసంపన్నం చేసింది. ఈ చర్చలు వివిధ పరిశోధనా రంగాలలో వేన్ స్టేట్ యూనివర్సిటీ యొక్క నైపుణ్యం గురించి విలువైన పరిజ్ఙానంను అందించాయి. బహుళ విభాగాలలో బలమైన సహకార పరిశోధన భాగస్వామ్యానికి మార్గం సుగమం చేశాయి అని కెఎల్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ (కెఎల్ఇఎఫ్)లో అంతర్జాతీయ సంబంధాల డీన్ డాక్టర్ ఎం. కిషోర్ బాబు అన్నారు.