US Presidential Election 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ పై ఘన విజయం సాధించారు. అయితే ఈ క్రమంలోనే ట్రంప్ తాజాగా తన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడారు. తన విజయానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికా రాజకీయాల్లో కొత్త స్టార్ ఎలన్ మస్క్ అని ట్రంప్ పేర్కొన్నారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్‌కు విజయ ప్రసంగంలో ధన్యవాదాలు తెలిపారు. “దేవుడు నా ప్రాణాన్ని ఒక కారణంతో తప్పించాడు” అని ట్రంప్ చెప్పారు. డోనాల్డ్ ట్రంప్ తన “విక్టరీ స్పీచ్”లో ఒక హత్యాయత్నాన్ని గుర్తుచేసుకుంటూ “దేవుడు ఒక కారణం కోసం నా ప్రాణాలను విడిచిపెట్టాడు” అని పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా ట్రంప్ అమెరికా ఉపాధ్యక్షుడిని ప్రకటించారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంటూ ప్రకటించారు. రిపబ్లిక్ పార్టీ విజయం పూర్తయిన తరువాత ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు. ఆయన ఏపీలోని నిడదవోలు నియోజకవర్గం వడ్లూరుకు చెందిన ఉషా చిలుకూరి భర్తనే జేడీ వాన్స్. దీంతో తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు అయ్యారు. విజయోత్సవ ప్రసంగంలో ట్రంప్.. వాన్స్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇది తెలుగు వారికి గర్వకారణమని ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు. అలాగే తన విజయంలో మెలానియా కీలక పాత్ర పోషించారని ట్రంప్ చెప్పారు.
ఇకపోతే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ మేరకు అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకొనున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు కావడం ఇది రెండోసారి. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఇప్పటికే 277 సీట్లలో విజయం సాధించారు. అధ్యక్షుడు కావడానికి మ్యాజిక్ ఫిగర్ 270 కాగా ఆయన 7 స్థానాల ఎక్కువగానే గెలుచుకున్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 266 సీట్లతో సరిపెట్టుకున్నారు. ఇంకా 35 చోట్ల కౌటింగ్ కొనసాగుతోంది. ట్రంప్ గెలుపుతో రిపబ్లికన్లు సంబురాలు చేసుకుంటున్నారు. ట్రంప్ ప్రచారం, ఆయనపై జరిగిన హత్యాయత్నంతో ఆయనకు మద్దతు పెరిగింది. అంతే కాదు డిబెట్ లో పై చేయి సాధించడంతో ఆయన ముందుకు దూసుకెళ్లాడు. అయితే డెమోక్రటిక్ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ తప్పించి కమలా హారిస్ కు అవకాశం ఇచ్చింది. దీంతో ట్రంప్ కు కాస్త ఆధిక్యం తగ్గింది. హారిస్, ట్రంప్ హోరాహోరీగా ప్రచారం చేశారు.