Viral Video : టీచర్ ప్రశ్నకు పాకిస్థానీ అమ్మాయి చెప్పిన సమాధానం వింటే నవ్వు ఆపుకోలేరు..!!

సోషల్ మీడియాలో ఒక వీడియో ఇప్పుడు తెగవైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు.

  • Written By:
  • Publish Date - September 26, 2022 / 06:04 PM IST

సోషల్ మీడియాలో ఒక వీడియో ఇప్పుడు తెగవైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. పాకిస్తాన్ కు చెందిన ఒక అమ్మాయి తన టీచర్ అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం…చూసి టీచర్ కూడా షాక్ అయ్యింది. బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన ఆమె తల్లి ఈ రోజు క్లాస్ రూంలో ఏం జరిగింది అని అడుగుతుంది. టీచర్ నన్ను బయాలజీ గురించి ప్రశ్న అడిగింది. నేను ఫిజిక్స్ గురించి సమాధానం చెప్పాను. నాకు ఫిజిక్స్ తెలియదనుకున్నారు. ఫిజిక్స్ అంటే ఏంటీ అని వాళ్ల అమ్మ అడుగుతుంది. ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా.?. సమాధానం చెబుతామనుకుని మర్చిపోయా…చివరిది గుర్తుంది. అదే ఫిజిక్స్. అది విన్న ఆ అమ్మాయి తల్లి కూడా షాక్ అయ్యింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి రూపిన్ శర్మ తన సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేశారు. స్మైలీ స్టిక్కర్స్ తో భౌతికశాస్త్రం అని క్యాప్షన్ ఇచ్చాడు. కొందరు పాకిస్థానీ అమ్మాయిని కామెంట్ చేస్తూ ప్రశంసించారు. మోహిత్ అనే నెటిజన్ – మన భారతదేశంలో ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు ఎంతో ఉన్నారంటూ కామెంట్ చేశారు.