Site icon HashtagU Telugu

Hydra : హైడ్రాకు మరో కీలక బాధ్యత..!

Hydra (1)

Hydra (1)

Another key responsibility for Hydra: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం కోసం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైడ్రా నగరంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఆక్రమణల కూల్చివేతలు చేపడతూ వార్తల్లో నిలుస్తోంది.

Read Also: Mahatma Gandhi : మహాత్మాగాంధీకి ప్రత్యేక రైల్వే బోగీ అంకితం.. విశేషాలివీ..

ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం మంజూరు చేసే బిల్డింగ్ పర్మిషన్ల ప్రక్రియలోనూ హైడ్రాను చేర్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నగరంలో ఇళ్ల నిర్మాణాలకు ఇక నుంచి హైడ్రా వద్ద కూడా ఎన్ఓసీ పొందాలనే కొత్త నిబంధనను అనుమతుల ప్రక్రియలో చేర్చే యోచనలో సర్కార్ ఉందట. కాగా, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో హైడ్రా అనుమతి లేకుండా ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే ఆ ఇంటి నంబర్, కరెంట్, నల్లా కనెక్షన్లను తొలగించనున్నట్లు సమాచారం. పేద, మధ్య తరగతి ప్రజలు నష్టపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా హైడ్రా దుకుడుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించడం, చెరువులను రక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ) ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ సంస్థ అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. ఈ సంస్థకు ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్ కమిషనర్‌గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కీలక బిల్డింగ్‌లను కూడా కూల్చేశారు. దాంతో.. హైడ్రా రాష్ట్రంలోనే హాట్‌టాపిక్‌ అయ్యింది. తాజాగా ఏవీ రంగనాథ్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Read Also: YS Jagan Guntur Tour: గుంటూరు జైలులో వైఎస్‌ జగన్‌, టీడీపీ రెడ్‌బుక్‌పైనే దృష్టి