Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..
మేష రాశి
ఈరోజు మేషరాశిలోని ప్రేమికులు పెళ్లిదిశగా అడుగువేయాలి అనుకుంటే ప్రయత్నం చేయవచ్చు. ఇతరుల గురించి ఆలోచిస్తారు. ప్రయాణాల్లో సమస్యలుంటాయి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించండి. కొందరి ప్రవర్తన వల్ల లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి.
వృషభ రాశి
ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఆపదలు చుట్టుముడతాయి. మనస్సు కొంత విచారంగా ఉంటుంది. ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సాహసోపేతమైన పనులు చేసేందుకు వెనుకాడరు. తగినంత శ్రమ అవసరం. గణపతి ఆరాధన ఉత్తమం.
మిథునం
ఈరోజు మిథునరాశి వారికి అలసట, ఒత్తిడి వల్ల బలహీనంగా అనిపిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. విజ్ఞతతో, విచక్షణతో పని చేయాలి. రుణ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవాలి. మిత్రుల సలహాతో ఆపద నుంచి బయటపడతారు. మహావిష్ణువును పూజించాలి.
కర్కాటకం
ఈరోజు కర్కాటక రాశి వారు విమర్శలకు దూరంగా ఉండండి. మీ ఆలోచనలను నియంత్రించుకోవాలి. మనస్సు చంచలంగా ఉంటుంది. విశ్రాంతి అవసరం. మీ దినచర్య గందరగోళంగా ఉండొచ్చు. శత్రు పీడ తొలగుతుంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళితే అపార్థాలకు తావు ఉండదు. వేంకటేశ్వర స్వామిని పూజించాలి.
సింహం
ఈరోజు సింహరాశి వారికి విఘ్నాలు ఎదురవుతాయి. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. పనిభారం పెరుగుతుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. కార్యాలయంలో మీకు అనుకూలంగా పనులు జరుగుతాయి.వినాయకుడిని పూజించండి.
కన్య (Today Horoscope)
ఈరోజు కన్యారాశి వారికి స్థానచలన సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీ విషయంలో తొందరపాటు కారణంగా కొంత నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. మీ శత్రువులు యాక్టివ్ గా ఉంటారు.. జాగ్రత్త. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అధికారం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడిని పూజించాలి.
తుల
ఈరోజు తులారాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పనుల్లో ఒత్తిళ్ళు అధికము. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏదో నిరాశలో ఉంటారు. మనసైనవారి విషయంలో మనసులో కొంత ఆందోళన ఉంటుంది. ఆస్తిపరమైన తగాదాలు రాకుండా జాగ్రత్తపడండి. వ్యాపార లావాదేవీల సమస్యలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.
వృశ్చికం
ఈరోజు వృశ్చిక రాశివారికి ఆపదలు పొంచి ఉన్నాయి. మొహమాటంతో కొత్త ఇబ్బందులు రావచ్చు. వైవాహిక సంబంధాలలో ఇబ్బందులుంటాయి. మీదైన ప్రతిభ మిమ్మల్ని అందలమెక్కిస్తుంది. కొన్ని పనులకు సంబంధించిన గందరగోళానికి పరిష్కారం లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది.
ధనుస్సు
ఈరోజు ధనుస్సు రాశి వారు కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉ౦డాలి. నిందారోపణ చేసేవారున్నారు. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. గతంలో కాని పనుల్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. వినాయకుడిని పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది.
మకరం
ఈరోజు మకర రాశి వారికి సొంత నిర్ణయాలు కలిసిరావు. వ్యాపారులు అప్పులు చేయాల్సి రావొచ్చు. నిజం దాచడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్య సందర్భాల్లో శ్రద్ధగా మాట్లాడండి. కుటుంబం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగులు.. ఉన్నతాధికారులతో వాదనలు పెట్టుకోవద్దు. మనోబలాన్ని పెంచుకోవాలి. కృష్ణాష్టకం పఠించాలి.
కుంభం
ఈరోజు కుంభ రాశి వారు ఇతరుల సలహాలు విన్నా.. మీదైన నిర్ణయం తీసుకోండి. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో కొన్ని సాంకేతిక మార్పులు చేస్తారు. సన్నిహితులను నిర్లక్ష్యం చేయకండి. మహావిష్ణువును పూజించాలి.
మీనం
ఈరోజు మీన రాశి వారు ఇతరుల సలహాల మేరకు పనిచేయొద్దు. మీ నిర్ణయం మీరే తీసుకోండి. పనిలో నిరాశక్తత ఉండొచ్చు.అజాగ్రత్తగా వ్యవహరించవద్దు. ప్రయాణం చేసేటప్పుడు అతివేగం ప్రమాదకరం. మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. పూర్వీకుల ఆస్తి విషయంలో కుటుంబంలో చికాకులు ఏర్పడవచ్చు. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.