Today Horoscope : సెప్టెంబరు 5 మంగళవారం రాశి ఫలాలు.. వారు అనవసర వాదనలు పెట్టుకోవద్దు

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 07:45 AM IST

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశిలోని ఉద్యోగులు అనవసర వాదనలు పెట్టుకోవద్దు. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. చికాకులు అధికముగా ఉండును. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారి ఆర్థిక వ్యవహారాలకు భంగం కలగొచ్చు. అనవసర ఖర్చు తగ్గించాలి. వ్యక్తిగత పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. సోమరితనం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోతారు. రైతాంగం, సినీరంగంవారికి కొంత కలసివచ్చును. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మిథునం

ఈరోజు మిథునరాశి వారు తమ పిల్లల విజయాలను చూసి గర్విస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలం. ఈరోజు ఏ పని చేసినా కలసివచ్చును. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారు తమ పిల్లలకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ను  పరిష్కరించేందుకు ట్రై చేయడం మంచిది. మీ పనుల్లో పురోగతి కనబడును. వృత్తి ఉద్యోగపరంగా మధ్యస్థం నుండి అనుకూలం. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

సింహం

ఈరోజు సింహరాశి వారికి తమ ఎకానమికల్ స్థితి గురించి ఆందోళన ఉంటుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి సలహాలు తీసుకున్న తర్వాత వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడం మంచిది. ఖర్చులు నియంత్రించుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా జాగ్రత్తలు వహించాలి. మీరు చేసే పనుల్లో చికాకులు ఇబ్బందులు కలుగును. ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారు లాంగ్ జర్నీ చేయకపోవడమే మంచిది. ఇంట్లో ఏ పనీ చేయాలని అనిపించదు. మీ బలహీనతలను అధిగమించాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. రుణ సమస్యలు బాధించును. చికాకులు, ఇబ్బందులతో కూడిన వాతావరణం. ఆర్థిక సమస్యలు బాధపెట్టును. రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

Also read: Benefits Of Curd: ప్రతిరోజూ పెరుగు తింటే ఇన్ని ప్రయోజనాలా.. అయితే మిస్ చేయకండి..!

తుల

ఈరోజు తులారాశి వారు  అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. స్త్రీలకు, విద్యార్థులకు కలసివచ్చే సమయం. వాద ప్రతివాదనలకు దూరంగా ఉండాలి. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారి క్షమశిక్షణా రాహిత్యం వల్ల దినచర్య చెడిపోతుంది.  చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. గొడవలకు దూరంగా ఉండాలి. ఆవేశపడకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారు కుటుంబానికి సమయం కేటాయించడం కష్టమవుతుంది. ధనపరంగా కలసివస్తుంది. ప్రయాణాలు అనుకూలించును. ఉద్యోగస్తులకు కలసివచ్చే రోజు. విద్యార్థులకు ఈరోజు అన్ని విధాలుగా కలసివచ్చును. శుభ ఫలితాల కోసం సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయాలి.

మకరం

ఈరోజు మకర రాశిలోని  రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు వ్యతిరేకతను ఎదుర్కోవలసి ఉంటుంది. తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు. ఆలస్యమైనా సరైన దిశలో పనులు పూర్తవుతాయి. మీ పనుల్లో చికాకులు అధికము. గొడవలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిళ్ళు ఏర్పడును. ఆహార విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రైతాంగం, సినీరంగం వారికి అనుకూలంగా లేదు. దుర్గాదేవిని పూజించాలి.

కుంభం

ఈరోజు కుంభ రాశి వారు జన్మశని ప్రభావం వల్ల కుటుంబ, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఏర్పడును. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా జాగ్రత్తలు వహించాలి. ప్రతి పనిలో చికాకులు ఏర్పడును. విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి.

మీనం 

ఈరోజు మీన రాశి వారికి కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురుకావచ్చు. తెలియని వారిని నమ్మి ఒప్పందాలు చేసుకోవద్దు. స్నేహం, ప్రేమ గురించి మీ ఆలోచన మారవచ్చు. కొన్ని రహస్య విషయాలపై ఆసక్తి చూపిస్తారు. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. ఖర్చులు అధికమగును. ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏర్పడును. కోర్టు సమస్యలు ఇబ్బంది పెట్టును. గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండాలి. అప్పులు చేయరాదు. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.