Today Horoscope : సెప్టెంబరు 12 మంగళవారం రాశిఫలాలు.. వారికి టెన్షన్ పెరుగుతుంది

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

  • Written By:
  • Publish Date - September 12, 2023 / 09:26 AM IST

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం. పనిభారం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పైస్థాయి వారి వల్ల సమస్యలు కలగొచ్చు.  ఇతరులతో అవగాహనా లోపం వల్ల సమస్యలు ఏర్పడుతాయి. సుబ్రహ్మణ్యుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారికి తోటివారితో విభేదాలు కలుగుతాయి. కొందరితో కలహాలు కలగొచ్చు. వ్యాపార లావాదేవీల విషయంలో అలర్ట్ గా ఉండాలి. మానసిక ఒత్తిడి ఏర్పడొచ్చు. ఆస్తి కొనే విషయంలో ఇబ్బందులు కలుగుతాయి. అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథునం

ఈరోజు మిథునరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబముతోను, స్నేహితులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వడానికి, తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. సుబ్రహ్మణ్య అష్టకం చదవండి.

Also read: Matsya 6000 : సముద్రయాన్ కోసం ‘మత్స్య 6000’ రెడీ.. విశేషాలివీ ?

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలించును. ప్రయాణాలు కలిసొస్తాయి. ఇతరులతో వాగ్వాదానికి దిగకూడదు. శుభఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాలం టైంలో దుర్గాదేవిని పూజించడం మంచిది.

సింహం

ఈరోజు సింహరాశి వారికి మానసిక ఒత్తిళ్ళు కలిగే అవకాశం ఉంది. శారీరక శ్రమ పెరగొచ్చు. చెడు స్నేహాలను వదిలేయాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగంలో సమస్యలు రావచ్చు. వ్యాపారస్తులకు చెడుకాలం. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవాలి.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారికి ఆకస్మిక ధనలాభము జరగొచ్చు. అనవసర ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఆర్థిక విషయాలపై శ్రద్ధ  పెంచండి. కుటుంబ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పెద్దల సలహాలు తీసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

Also read: Petrol- Diesel Prices: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. నిన్నటితో పోలిస్తే రేట్స్ ఎలా ఉన్నాయంటే..?

తుల

ఈరోజు తులారాశిలోని వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. అనవసర ఖర్చులు చేయకూడదు. జీవిత భాగస్వామికి, సంతానానికి సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు. సోదరులు, స్నేహితులు మీకు సహకరిస్తారు. విఘ్నేశ్వరుడిని పూజించాలి.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రమ ఒత్తిడిని అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా సత్ఫలితాలు వస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సమయపాలనను అలవాటు చేసుకోండి అన్నిచోట్లా రాణిస్తారు. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారు ఆర్థికంగా బలపడతారు. మీరు తీసుకునే నిర్ణయాలతో విజయాలు వరిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది.

మకరం

ఈరోజు మకర రాశి వారికి ప్రతికూల సమయం. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. అతివేగంగా వాహనాలు నడపొద్దు. మీకు కోపం తెప్పించే వాళ్లకు దూరంగా ఉండండి.   ఉద్యోగస్తులకు ట్రాన్స్ ఫర్స్ జరగొచ్చు. విద్యార్థులకు నూతన అవకాశాలు కలుగును. దుర్గాదేవిని పూజించాలి.

Also read: CM YS Jagan: లండన్ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న సీఎం జగన్

కుంభం

ఈరోజు కుంభ రాశిలోని భార్యాభర్తల మధ్య గొడవలకు ఛాన్స్ ఉంది. ఏవైనా అభిప్రాయబేధాలు తలెత్తితే.. సామరస్యంగా పరిష్కరించుకోవాలి. వాగ్వాదాలను పొడిగించుకోకూడదు. పెద్దల సలహాతో వ్యాపార నిర్ణయాలు తీసుకోండి. విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి.

మీనం 

ఈరోజు మీన రాశి వారు చేసే ప్రతి పనిలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి  ఉండొచ్చు. ఉద్యోగస్తులకు అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు ఖర్చులు పెరుగుతాయి. డబ్బులకు సంబంధించిన నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి.  దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించండి. రాహుకాల సమయంలో దుర్దాదేవిని పూజించండి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత