Site icon HashtagU Telugu

Today Horoscope : ఆగస్టు 29 మంగళవారం రాశి ఫలాలు.. వారికి హడావుడి తప్పదు

Today Horoscope

Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారికి కుటుంబ ఖర్చులు అకస్మాత్తుగా పెరగొచ్చు. ఈ కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఈరోజు మీ కుటుంబ వ్యాపారంలో మెరుగైన ఫలితాల కోసం ఒక ప్రత్యేక ఒప్పందాన్ని ముగిస్తారు. మీ ఇంటి జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశాన్ని పొందుతారు. మీ కుటుంబ సభ్యులతో ఏమైనా సమస్యలుంటే, జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఏదైనా అంటే వాటిని పట్టించుకోకండి. ఈరోజు సాయంత్రం కొన్ని శుభకార్యాల్లో పాల్గొనొచ్చు.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఆనందకరమైన వాతావరణం. విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూలం. స్త్రీలు ఇష్టమైన వస్తువుల కోసం ధనమును ఖర్చు చేసెదరు. సోదరవర్గంతో ఆహ్లాదంగా గడుపుతారు. మీరు చేసే పనులు కలసివస్తాయి. అమ్మవారిని పూజించాలి. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథునం

ఈరోజు మిథునరాశి వారి పనిలో కొంచెం హడావుడి ఉంటుంది. మనసంతా సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో విహారయాత్రకు, సినిమాలు ప్లాన్ చేసుకుంటారు. కానీ మనసులో ఆందోళన ఉంటుంది, ఎమోషనల్‌గా ఉంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి

Also read: Vyara Politics : బద్ద శత్రువులు ఒకటయ్యారు..ఇక వైరా లో గులాబీ గెలుపు ఖాయమేనా..?

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారు ఏ పనిచేసినా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. సోదరుల సహాయంతో, మీ పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయొచ్చు. మీ తండ్రి నుండి ముఖ్యమైన సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సాయంత్రం మీరు వ్యాపారానికి సంబంధించి ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేస్తే, అప్పుడు మీరు చాలా మంచి ప్రయోజనం పొందుతారు. దీని వల్ల భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందుతారు.

సింహం

ఈరోజు సింహరాశి వారికి అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు, రాజకీయ నాయకుల ప్రమేయాలు ఇబ్బంది కలిగించును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమగును. రైతాంగం, సినీరంగంవారికి అంత అనుకూలంగా లేదు. ఆవేశపూరిత నిర్ణయాలకు, ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలని సూచన. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారికి అంత అనుకూలంగా లేనందున అప్రమత్తంగా ఉండండి. ఏ పని చేయాలని అనిపించదు. ధనం నష్టపోయే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. పనిలో విజయం సాధించడంలో వైఫల్యం నిరాశకు దారితీస్తుంది. పిల్లల గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణాలు చేయాల్సి వస్తే వాయిదా వేసుకోవడమే మంచిది

Also read:Major Dhyan Chand: అసలు సిసలు క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్.. తన ఆటతో హిట్లర్​నే ఫిదా చేశాడు..!

తుల

ఈరోజు తులారాశి వారిలో వ్యాపారులు ఏదైనా కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తే, దాని వల్ల భవిష్యత్తులో మంచి లాభాలను పొందుతారు. విద్యార్థులకు ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీరు మీ తండ్రి మార్గదర్శకత్వంలో చేసిన పనిలో విజయం సాధిస్తారు. మీ తల్లి కంటి సంబంధిత వ్యాధులు ఈరోజు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో వైద్యుల సలహా తీసుకోవాలి. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు మంచి ఫలితాలొస్తాయి. మీకు ఏదైనా పాత రుణం ఉంటే, ఈరోజు మీరు దానిని వదిలించుకోవచ్చు.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశి వారికి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మనస్సును నియంత్రించుకోవాలి. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. కుటుంబ, ఇతర వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. పని ఒత్తిళ్ళు, కుటుంబ సమస్యలు ఏర్పడును. సంతానం వలన చికాకులు కలుగును. విద్యార్థులకు మధ్యస్థం. రైతాంగానికి అనుకూలం. స్త్రీలకు చెడు సమయం. మరింత శుభఫలితాలు పొందాలంటే బుుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరుడిని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిపేందుకు ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళటానికి సుముఖంగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ శ్రమకి తగిన ఫలితం లభించకపోవటంతో కొంత నిరాశ చెందుతారు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.

మకరం

ఈరోజు మకర రాశి వారు వ్యాపారంలో భాగస్వామిని నమ్మి రిస్క్ తీసుకుంటే, భవిష్యత్తులో పెద్ద నష్టం రావొచ్చు. ఈరోజు మీరు మీ బంధువులలో ఎవరికైనా కొంత డబ్బు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఉపాధి రంగంలో పని చేసే వారు మంచి అవకాశాలను పొందొచ్చు. ఈరోజు మీరు మీ దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడంలో సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది.

Also read: Egg Side Effects: గుడ్లు ఎక్కువగా తింటున్నారా.. అయితే దుష్ప్రభావాలు ఇవే..!

కుంభం

ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. మీ తెలివితేటలతో అధికారులను మెప్పిస్తారు. ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రుల ఆదరాభిమానాలు లభిస్తాయి. అదృష్టం తోడుంటుంది. ఇతరుల సలహాలు పనికిరావు. విజయం ఉంది. వేంకటేశ్వరస్వామిని ప్రార్ధించండి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మీనం 

ఈరోజు మీన రాశి వారు ఏ కొత్త పనిని ప్రారంభించినా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు  ప్రమోషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, ఆర్ధిక వనరులు పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆనందం ,శాంతి ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది.  స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడిందిమా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమేదాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలిఅదనంగాదాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.