Today Horoscope : ఆగస్టు 28 సోమవారం రాశి ఫలాలు.. వారికి శ్రమ పెరుగుతుంది

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

Published By: HashtagU Telugu Desk
Today Horoscope

Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారు ఆర్ధిక వ్యవహారాల్లో గొడవలు రాకుండా వ్యవహరించాలి.  ముఖ్యంగా బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఏ పనిని ప్రారంభించినా ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా వాటిని అధిగమిస్తారు. తెలియని వారితో ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. శత్రుపీడ ఉంది. ఆపదలను ఎదుర్కొంటారు. ఒక వార్త విచారాన్ని కలిగిస్తుంది. శివాష్టకం పఠించడం మంచిది.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారికి ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. శ్రమ పెరుగుతుంది. ఎవరేమన్నా పట్టించుకోకుండా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. సందర్భానుసారంగా ప్రవర్తిస్తే అంతా శుభమే జరుగుతుంది. అష్టమంలో ఉన్న చంద్రుడు అనుకూలంగా లేడు. చంద్రుడిని శాంత పరిచేందుకు చంద్ర శ్లోకాన్ని చదవండి.  పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివ నామస్మరణ చేయండి.

మిథునం

ఈరోజు మిథునరాశి వారికి ఒక సంతోషాన్ని ఇస్తుంది. సమయస్ఫూర్తి మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త ఆలోచనలు వికసిస్తాయి. దుర్గాదేవి స్తుతిస్తే ఎంతో మేలు. శివుడికి తేనెతో అభిషేకం చేయండి.

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారికి మనశ్శాంతి లోపించే అవకాశం ఉంది. దుర్గాదేవి శ్లోకాలను చదువుతుంటే మనశ్శాంతిగా ఉంటుంది. ఎవరినీ విమర్శించకుండా మన పని మనం చేసుకోవడం మంచిది. పొదుపు పాటించాలి. శీఘ్ర ఫలితాలున్నాయి. పాలతో శివుడిని అభిషేకం చేయండి.

సింహం

ఈరోజు సింహరాశి వారు ఏకాగ్రతతో పనిచేయాలి. అదృష్టయోగం వరిస్తుంది. ఒక శుభవార్త వల్ల మీ మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. మీదైన రంగంలో అవగాహన పెంచుకుంటూ పనిచేయండి. చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారికి కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. అపార్థాలకు తావివ్వకండి. ఎవరినీ అతిగా నమ్మడం మంచి పద్ధతి కాదు. ధన వ్యయం పెరిగే అవకాశం ఉంది. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. జాబ్ లో స్థానచలన మార్చులున్నాయి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి.

తుల

ఈరోజు తులారాశి వారు కుటుంబముతో వివాదాలకు దూరంగా ఉండండి. ఏ విషయంలోనైనా ఆచి తూచి వ్యవహరించండి. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. న్యాయపరమైన అంశాల్లో విజయం మీదే. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారు ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. ఎవరినీ అతిగా నమ్మడం మంచిది కాదు. సహాయం చేయబోతే సమస్యలు ఎదురవుతాయి. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. విజ్ఞానపరంగా విజయం ఉంది. పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారు శనిదోషం వల్ల మోసపోయే ప్రమాదం ఉన్నది. బాధ్యతాయుతంగా ప్రవర్తించి లక్ష్యాన్ని అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు వెళతారు. మీరు ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.  శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకరం

ఈరోజు మకర రాశి వారిని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. వారిని పూర్తిగా పట్టించుకోవడం మానేయాలి. వారితో కలహాలు పెట్టుకుని సమయాన్ని వృధా చేసుకోవద్దు. మిత్రులతో కలసి పనిచేస్తే ఇబ్బందులుండవు. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభం

ఈరోజు కుంభ రాశి వారికి వృధా వ్యయం ఉంది. మనశ్శాంతి లోపించకుండా మాట్లాడండి.  మీ నిర్ణయాలు స్థిరంగా ఉండాలి. సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కొన్ని బాధపెట్టే సంఘటనలు కూడా జరుగుతాయి. మీ పై అధికారులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీనం 

ఈరోజు మీన రాశి వారు ఖర్చులు అదుపు తప్పకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యులు ఆదుకుంటారు.  మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.

  Last Updated: 28 Aug 2023, 07:25 AM IST