Site icon HashtagU Telugu

Principal : గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్..సస్పండ్ చేయాలంటున్న విద్యార్థులు

Women Principal

Women Principal

గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతూ..విద్యార్థినులు అని కూడా చూడకుండా బూతులు తిడుతున్న మహిళా ప్రిన్సిపాల్ బాగోతం బట్టబయలు అయ్యింది. ఈ ఘటన సూర్యాపేట – బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లోచోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల కాలంలో హాస్టల్ వార్డన్స్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఇలా ప్రతి ఒక్కరు కూడా చాల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థినులు అని కూడా చూడకుండా లైంగికంగా విధించడం, తిట్టడం , కొట్టడం వంటివి చేస్తూ సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొన్ని కొన్ని స్కూల్స్ లలో ఉపాధ్యాయులు తప్పతాగి వస్తూ..స్కూల్ ముందే పడిపోతున్నారు. తాగి వచ్చి కొట్టడం , ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నారు.

తాజాగా సూర్యాపేట – బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో ‌ రాత్రిళ్లు గదుల్లో ప్రిన్స్ పాల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ..మద్యం సేవిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.ఇదేంటి మేడం..మీరు ఎలా చేయొచ్చా అని అడిగితే డిగ్రీ విద్యార్థినులు చూడకుండా తిట్టడం , కొట్టడం చేస్తుంది. గత కొద్దీ రోజులుగా భరిస్తూ వచ్చిన స్టూడెంట్స్..ఈ విషయాన్నీ తల్లిదండ్రులకు తెలియజేయగా..వారు మీడియా తో వచ్చి ప్రిన్స్ పాల్ బాగోతం బట్టబయలు చేసారు. ఇలాంటి ప్రిన్స్ పాల్ ను, కేర్ టేకర్ ను వెంటనే సస్పెండ్ చేయాలనీ స్టూడెంట్స్ అలాగే తల్లిందండ్రులు కోరుతున్నారు. ప్రిన్స్ పాల్ శైలజ పద్ధతి ఏమాత్రం బాగోదని, రాత్రిపూట తాగి ఇష్టంవచ్చినట్లు చేస్తుందని , తల్లిదండ్రులతో కూడా సరిగా మాట్లాడదని ఈమెనే వెంటనే సస్పెండ్ చేయాలనీ , మీము మేజర్లం , ఓటు హక్కు కూడా ఉంది..అలాంటి మాపై చేయిసుకుంటుందని వారంతా వాపోతున్నారు. మరి ఈమె ఫై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Read Also : Bajaj Freedom CNG Bike: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ బైక్ రైడ‌ర్ల‌కు సురక్షితమేనా? కంపెనీ ఏం చెబుతుంది..?