Bar Girls : ప్రభుత్వ స్కూల్లో బారాత్.. బ్రాండీ.. బార్ గర్ల్స్ డ్యాన్స్.. వీడియో వైరల్!!

ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్కూల్లో పెళ్లి బారాత్ ను నిర్వహించారు. అంతేకాదు.. పవిత్రమైన విద్యాలయంలో మద్యం తాగి రచ్చ రచ్చ చేశారు.

  • Written By:
  • Publish Date - December 5, 2022 / 07:45 AM IST

ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్కూల్లో పెళ్లి (wedding) బారాత్ ను నిర్వహించారు. అంతేకాదు.. పవిత్రమైన విద్యాలయంలో మద్యం తాగి రచ్చ రచ్చ చేశారు. అంతటితోనూ ఆగలేదు.. స్కూల్ స్టేజీ పై బార్ గర్ల్స్ (Bar Girls) తో డ్యాన్స్ చేయించారు. యూపీలోని ఫతేపూర్‌ జిల్లా కిషన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇటౌలీ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

యూపీలోని ఫతేపూర్‌ జిల్లా ఇటౌలీ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పెళ్లి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో బార్ గర్ల్స్ డ్యాన్స్ ప్రోగ్రాం మధ్యలో బారాతీలు భీకరంగా పార్టీ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు స్కూల్ కు వచ్చి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. ఈ ప్రభుత్వ స్కూల్ లో విద్యాశాఖ అనుమతి లేకుండానే పెళ్లి ఊరేగింపులకు ఏర్పాట్లు చేసుకున్నారని స్థానికులు ఆరోపించారు. పెళ్లి వాళ్ళు స్కూల్ లోపల మద్యం పార్టీ చేసుకుంటుండగా.. స్థానికులు పాఠశాలకు చేరుకున్నారు. దీంతో కలకలం మొదలైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఘటనా స్థలానికి చేరుకొని ఎలాగోలా శాంతింపజేశారు. వివాహ వేడుకలో బార్ గర్ల్స్ నృత్యం జరిగింది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఒకవేళ అందితే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించగా.. సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు.