Farts – World End : పిత్తులు, తేన్పులు.. వీటిని మనం ఆపలేం. వచ్చే 200 ఏళ్లలో భూమిపై భరించలేని విధంగా గ్రీన్ హౌస్ వాయువులు పెరిగిపోవడానికి పిత్తులు, తేన్పులు కూడా ప్రధాన కారణమవుతాయని బ్రిటన్‌కు చెందిన యూకే సెంటర్ ఫర్ ఎకోలజీ అండ్ హైడ్రాలజీ తాజా అధ్యయనంలో తేలింది. కాలుష్యం, ప్రమాదకర వాయువులు, పిత్తులు, తేన్పుల వల్ల భూమి బాగా వేడెక్కిపోతుందని ఈ స్టడీ రిపోర్ట్ పేర్కొంది. డాక్టర్ నికోలస్ కోవాన్ సారధ్యంలోని శాస్త్రవేత్తల టీమ్ ఈవిషయాన్ని వెల్లడించింది. వచ్చే 200 ఏళ్లలో భూమి కూడా శుక్రగ్రహంలాగా మారి, మనుషులు జీవించేందుకు అనుకూలంగా ఉండదని(Farts – World End) వార్నింగ్ ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
మనుషులు రిలీజ్ చేసే పిత్తులు, తేన్పులలో ఎక్కువగా మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, అయోన్ ఫ్లాటస్ వాయువులు ఉంటాయని అధ్యయన నివేదిక తెలిపింది. ఇవి భూతాపాన్ని పెంచుతున్నాయని పేర్కొంది. దీనిపై స్విట్జర్లాండ్‌లోని జెనీవా యూనివర్సిటీకి చెందిన గిల్లామ్ చావెరట్ విశ్లేషణ చేస్తూ.. ‘‘భూతాపం వల్ల సముద్రాలు త్వరగా ఆవిరవుతున్నాయి. నీటి ఆవిరి ఆకాశంలోకి వెళ్లి.. ఓ దుప్పటిలాగా పరుచుకుంటోంది. ఫలితంగా భూమిపై ఉన్న వేడి.. వాతావరణంలో కలవట్లేదు. క్రమంగా ఈ వేడి పెరిగిపోతూనే ఉంది. ఇలా భూమి వేడెక్కుతున్న కొద్దీ సముద్రాల్లో నీరు మాయం అవుతూనే ఉంటుంది. కొన్నేళ్లలో సముద్రాలు పూర్తిగా ఆవిరి అవుతాయి. ఉష్ణోగ్రతలు కొన్ని వందల డిగ్రీలు పెరుగుతాయి’’ అని వివరించారు. సూర్యుడి నుంచి భూమికి రేడియేషన్ పెరుగుతున్న కొద్దీ .. భూమిపై వేడి పదుల డిగ్రీలు పెరుగుతూపోతుందన్నారు. తమ అధ్యయన టీమ్‌లో స్విట్జర్లాండ్ లోని వ్యోమగాములు, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లోని సీఎన్ఆర్ఎస్ లేబొరేటరీస్‌కు చెందిన నిపుణులు పాల్గొన్నారని గిల్లామ్ చావెరట్ వెల్లడించారు.