Delhi new cm atishi press meet: ఢిల్లీ తదుపరి సీఎంగా మంత్రి అతిశీ మర్లెనా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికైన అనంతరం ఆమె తొలి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేజ్రీవాల్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ”ఢిల్లీ సీఎంగా నన్ను ఎంపిక చేసినందుకు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాపై ఎంతో నమ్మకంతో ఆ బాధ్యతను అప్పగించారు. ఇలాంటి అవకాశం ఆప్‌లోనే సాధ్యం అవుతుంది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈ అవకాశం కల్పించారు. ఇతర పార్టీల్లో ఉన్నట్లయితే నాకు ఎన్నికల్లో టికెట్ కూడా దక్కేది కాదు. కేజ్రీవాల్ నన్ను ఎమ్మెల్యేను, మంత్రిని చేశారు.. ఇవాళ సీఎం అయ్యే అవకాశం వచ్చింది” అని అతిశీ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ని తన గురువుగా అభివర్ణించారు. తదుపరి ఎన్నికల్లో కేజ్రీవాల్‌ని సీఎం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
Read Also: Man Control Alexa : మెదడుతో అలెక్సాను కంట్రోల్ చేయొచ్చు.. ఎలా అంటే ?
కేజ్రీవాల్‌పై తప్పుడు కేసులు నమోదు చేసి, ఆప్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని బీజేపీపై అతిషీ ఆరోపణలు గుప్పించారు. ”ఢిల్లీకి ఒకే ఒక్క ముఖ్యమంత్రి, అది అరవింద్ కేజ్రీవాల్.. కేజ్రీవాల్‌ను తిరిగి ఢిల్లీ ముఖ్యమంత్రిగా తీసుకురావడమే లక్ష్యంగా రాబోయే కొద్ది నెలల పాటు కృషి చేస్తాను.” అని ఆమె అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఒక రాష్ట్రానికి సీఎం కావడం ఆప్‌లోనే సాధ్యమని అన్నారు. ”నేను వేరే పార్టీలో ఉండి ఉంటే, బహుశా నాకు ఎన్నికల టిక్కెట్ కూడా ఇచ్చేది కాదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ నన్ను నమ్మి, నన్ను ఎమ్మెల్యే మరియు మంత్రిని చేసి, ఈ రోజు నాకు ముఖ్యమంత్రి బాధ్యతలు ఇచ్చారు” అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు 14 పోర్ట్‌ఫోలియోలను అతిశీ చూస్తున్నారు.
సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కి బెయిల్ ఇవ్వడం కేంద్రానికి చెంపెట్టని ఆమె అన్నారు. కేజ్రీవాల్‌ని తిరిగి సీఎంగా ఢిల్లీ ప్రజలు ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నిజాయితీ గురించి ప్రజలందరికీ తెలుసని, ఢిల్లీ ప్రజకు అందుతున్న సంక్షేమాన్ని గుర్తించి కేజ్రీవాల్‌ని సీఎం చేస్తారని ఆమె అన్నారు. కేజ్రీవాల్ సీఎం కాకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మొహల్లా క్లినిక్స్, ఉచిత వైద్యం ఉండవని చెప్పారు.
Read Also: Mandula Samuel : కౌశిక్ కు మతిభ్రమించింది – ఎమ్మెల్యే మందుల శామ్యూల్