Ex-Jharkhand CM Champai Soren Hospitalised: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ ఆస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. సోరెన్‌కు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడంతో జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ హాస్పిటల్‌లో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని ఆసుపత్రి జీఎం డాక్టర్ సుధీర్ రాయ్ తెలిపారు. ఆసుపత్రిలో చేరిన కారణంగా ‘మాంఝి పరగణ మహాసమ్మేళన్’కు నేరుగా వెళ్లలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో చంపాయ్ సోరెన్ పేర్కొన్నారు.
Read Also: Congress : ప్రధాని ఎప్పుడూ పాత ప్రసంగాలే : మల్లికార్జున ఖర్గే
కాగా, జేఎంఎం చీఫ్, అప్పటి సీఎం హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేయడంతో ఫిబ్రవరి 2న ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఐదు నెలల తర్వాత హేమంత్ సోరెన్ బెయిలుపై విడుదల కావడంతో చంపాయ్‌తో సీఎం పదవికి రాజీనామా చేయించారు. ఈ పరిణామలతో అసంతృప్తి చెందిన చంపాయ్ సోరెన్ గత ఆగస్టు 30న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ సమక్షంలో బీజేపీలో చేరారు. 67 ఏళ్ల గిరిజన నేత అయిన చంపయి సోరెన్‌కు ‘జార్ఖండ్ టైగర్’గా పేరుంది. 1990లో జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పోరాటం చేశారు.