Internet Sensation Abdu Rozik: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అబ్దు రోజిక్.. బిగ్ బాస్ తో వైరల్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు అబ్దు రోజిక్.. ఎవరూ  అబ్దు రోజిక్..?  హిందీ బిగ్ బాస్ లో ఎలా ఎంట్రీ ఇచ్చాడు?

  • Written By:
  • Updated On - September 29, 2022 / 03:13 PM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు అబ్దు రోజిక్.. ఎవరూ  అబ్దు రోజిక్..?  హిందీ బిగ్ బాస్ లో ఎలా ఎంట్రీ ఇచ్చాడు? సల్మాన్ ఖాన్, విరాట్ లాంటివాళ్లు స్టార్ ఈ బుడ్డొడ్ని ఎందుకు అభినందిస్తున్నారు? లాంటి విషయాలు హాట్ టాపిక్ గా మారాడు. బిగ్ బాస్ 16 కంటెస్టెంట్ అబ్దు రోజిక్ ప్రస్తుతం గూగుల్‌లో అత్యధిక ట్రెండ్‌లో ఉన్నారు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ఫైనల్ చేసిన బిగ్ బాస్ 16 పోటీదారులలో అబ్దు రోజిక్‌ను ఒకరిగా వెల్లడించారు. అబ్దు చిన్న పిల్లాడిలా కనిపించే ఓ పెద్దొడు.

అబ్దు వీడియోలను అప్‌లోడ్ చేసిన తర్వాత ఇంటర్నెట్ సంచలనంగా మారింది. అబ్దు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న తజికిస్తాన్ కు చెందినవాడు. మొదట తన మాతృభాషలో ర్యాప్ పాటలు పాడటంతో పాపులర్ అయ్యాడు. అవన్నీ యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారాయి. “ఓహి దిలీ జోర్”లో అనే మ్యూజిక్ ఆల్బమ్ హిందీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో, అబ్దు రోజిక్‌కి మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన యూట్యూబ్ ఛానల్ కు పెద్ద సబ్‌స్క్రైబర్ బేస్ కూడా ఉంది. అతను చిన్నవాడు అనే అభిప్రాయం ఉన్నప్పటికీ, 19 సంవత్సరాలు మాత్రమే. అతని పుట్టినరోజు సెప్టెంబర్ 3, 2003న జన్మించాడు. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ 16 కాంటెస్టెంట్ గా సెలక్ట్ కావడంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.