Site icon HashtagU Telugu

Warangal Railway Station : కాకతీయుల చరిత్రాత్మక కళ ఉట్టిపడేలా సుందరంగా రూపుదిద్దుకున్న వరంగల్‌ రైల్వే స్టేషన్‌..?

Beautifully Designed Warang

Beautifully designed Warangal Railway Station, which embodies the historical art of the Kakatiyas..?

Warangal Railway Station : కాకతీయుల శిల్పకళకు ప్రతిబింబంగా మారిన వరంగల్‌ రైల్వే స్టేషన్‌ ఇప్పుడు చారిత్రక వైభవాన్ని మళ్లీ తలపించేదిగా పునః రూపుదిద్దుకుంది. ‘అమృత్‌ భారత్‌ స్టేషన్ల అభివృద్ధి’ కార్యక్రమం కింద రూ.25.11 కోట్ల వ్యయంతో జరిగిన ఈ నూతన రూపకల్పన మే 22న అధికారికంగా పునః ప్రారంభం కానుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌ విధానంలో ప్రారంభించనుండగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఫిజికల్‌గా హాజరవుతారని వరంగల్‌ ఎంపీ కడియం కావ్య వెల్లడించారు. ఈ పునః ప్రారంభ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వరంగల్‌ స్టేషన్‌ ఇకపై కేవలం రవాణా కేంద్రంగా కాకుండా, ఒక సాంస్కృతిక ఆస్తిగా నిలవనుంది ” అని తెలిపారు.

Read Also: Republic India: రిపబ్లిక్ తన సొంత పిల్లలను చంపుకుంటుందా ?

కాకతీయుల చరిత్రను ప్రతిబింబించేలా నిర్మించిన శిల్పాలు, కళాత్మక ప్రాంగణాలు ఈ రైల్వే స్టేషన్‌కు కొత్త ఒరవడి తెచ్చాయి. ప్రాంగణంలోని మెయిన్‌ బిల్డింగ్‌పై కనిపించే శిల్పాలు కాకతీయుల గౌరవాన్ని ప్రతిబింబిస్తూనే, ఆధునికతకు సైతం ఉదాహరణగా నిలుస్తున్నాయి. పసుపు రంగు గోపుర నిర్మాణం, గోడలపై చెక్కిన శిల్పకళ, వరంగల్‌ కోటను తలపించే బహుళ తలుపుల గేట్లు – ఇవన్నీ ఒక కళాత్మక సంస్కృతిని మన కళ్లముందు నిలిపేలా ఉన్నాయి. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తన అధికారిక ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌) ఖాతాలో వరంగల్‌ రైల్వే స్టేషన్‌ పాత మరియు కొత్త రూపాలను పోల్చేలా పలు చిత్రాలను పంచుకున్నారు. “ఫిబ్రవరి 2024లో పనులకు శంకుస్థాపన జరిగి, మే 2025 నాటికి పూర్తి కావడమంటే ఇది ఒక వేగవంతమైన, నాణ్యమైన అభివృద్ధికి నిదర్శనం,” అని ఆయన పేర్కొన్నారు.

అభివృద్ధిలో భాగంగా వరంగల్‌ స్టేషన్‌లో పలు ఆధునిక వసతులు కల్పించారు. విశాలమైన పాదచారుల వంతెన, రెండు ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, క్లీన్‌ టాయిలెట్లు, డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డులు, వేచి ఉండే గదులు, వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక వసతులు వంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థంగా బహుళ ప్రవేశ ద్వారాలు, పార్కింగ్‌ స్థలాలు మరియు విస్తృతమైన ప్రాంగణాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఇక, “వరంగల్‌ స్టేషన్‌ దేశంలో ఒక ఆదర్శ స్టేషన్‌గా మారుతుంది. కాకతీయుల వారసత్వాన్ని గౌరవిస్తూ, ఆధునికతకు పట్టం కట్టిన విధంగా ఇది రూపుదిద్దుకుంది,” అని ఎంపీ కడియం కావ్య వెల్లడించారు. అదేవిధంగా కాజీపేట రైల్వే స్టేషన్‌లోనూ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక,పై వరంగల్‌ రైల్వే స్టేషన్‌ తూర్పు తెలంగాణలో ఒక ముఖ్యమైన ట్రాన్సిట్‌ హబ్‌గా మాత్రమే కాక, పర్యాటక ఆకర్షణగా కూడా నిలవనుంది. ఈ అభివృద్ధితో కాకతీయుల సాంస్కృతిక మహిమ దేశవ్యాప్తంగా మరింత చాటించబడనుంది.

Read Also: Kumki Elephant: మే 21న విధానసౌధలో ఏపీకి కుంకి ఏనుగుల హస్తాంతరణ