Today Horoscope : ఆగస్టు 18 శుక్రవారం రాశి ఫలితాలు.. వారు సంయమనంతో మెలగాలి

Today Horoscope ఈరోజు మేషరాశి వారు మిత్రులతో గొడవలకు దూరంగా ఉండాలి. సంతాన వివాహ విషయంలో ఆలోచనలు చేస్తారు.

  • Written By:
  • Updated On - August 18, 2023 / 08:09 AM IST

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారు మిత్రులతో గొడవలకు దూరంగా ఉండాలి. సంతాన వివాహ విషయంలో ఆలోచనలు చేస్తారు. వ్యాపారంలో  వచ్చిన ఇబ్బందులను తెలివిగా, దైర్యంగా ఎదుర్కొని ఉపశమనాన్ని పొందుతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. మీరు చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించాలి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశిలోని పురుషులు ఆచరణ సాధ్యం కాని నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. రుణాలు ఇవ్వటం,తీసుకోవటం రెండూ మంచివి కావు. కుటుంబంలో అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశముంది,  వాటిని నివారించటానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల అవసరాలను గమనించి మసలుకోండి. ఈ రాశి స్త్రీ చాలాకాలంగా ఎదురుచూస్తున్న పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. అప్పులు తొలగుతాయి. క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మిథునం

ఈరోజు మిథునరాశిలోని ఉద్యోగస్తులకు స్థానమార్పిడి మంచిదే. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో మంచి నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. విద్యార్థులకు అనుకూలం. కొత్త ప్రణాళికలు భవిష్యత్తుకి ఉపయోగపడతాయి.  గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశిలోని ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. విబేధాలు తెలెత్తే అవకాశం ఉంది. సంయమనంతో మెలగండి. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు సర్దుబాటవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశము.  వ్యాపారస్తులకు సమయం ఆశించినంత అనుకూలంగా లేదు. ధైర్యం కోల్పోకుండా కష్టపడి పని చేయండి. చుట్టు పక్కల వారితో అప్రమత్తంగా వ్యవహరించండి. వృధా ఖర్చులు చేయరాదు. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. రావలసిన ధనము సకాలంలో చేతికి అందుతుంది. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

Also read: SIM Card Dealers: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సిమ్ కార్డ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి..!

సింహం

ఈరోజు సింహరాశి వారికి మానసిక ఆందోళనలు కలుగును. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ప్రయివేటు ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతి లభిస్తుంది. షాపింగ్ చేయాలనుకుంటే ఇది అనుకూలమైన రోజు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల శ్రమకు మంచి ఫలితం ఉంటుంది. కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశిలోని  ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోండి. ప్రయాణం చేయాల్సి వస్తే వాయిదా వేసుకోవడమే మంచిది.మీ కోపం వలన మీరే నష్ట పోతారు. కుటుంబ బంధాలు, సన్నిహిత సంబంధాలలో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల  వివాదాలు తలెత్తుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న సమస్య నుండి బయటపడతారు.  ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి.

తుల

ఈరోజు తులారాశి వారు అనవసర ఖర్చుల్ని నియంత్రించాలి. ఆర్థికపరిస్థితి మెరుగుపడి అప్పుల బాధ నుండి బయటపడతారు. దైవ కార్యక్రమాల కోసం ధనసహాయం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. ప్రేమ వ్యవహారాలలో విజయం పొందుతారు.  పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారు ఇతరులతో వివాదాలు లేకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతాన వివాహ ప్రయత్నాలు కలసివస్తాయి. అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీ మనసులో ఉన్న సందేహాలకి స్వస్తి చెప్పండి. మీరు దాచిన సొమ్ముతో పాలసీలలో పెట్టుబడి పెట్టొచ్చు, ఆర్థిక ప్రణాళికలు కలిసి వస్తాయి.  ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పఠించండి.

Also read: Hormonal Breakouts: పీరియడ్స్ సమయంలో వచ్చే మొటిమలకు చెక్ పెట్టిండిలా?

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారు ఏవైనా సమస్యలుంటే  కుటుంబ పెద్దలతో కానీ .. కుటుంబ  సభ్యులతో కానీ చర్చించి నిర్ణయం తీసుకోవాలి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. అతి పెద్ద వ్యాపార ఒప్పందాలు మీ ముందుకు వస్తాయి. వాటిని చేజిక్కించుకోండి. విదేశాలలో వ్యాపారం చేసే అవకాశాలు లభిస్తాయి. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మకరం

ఈరోజు మకర రాశి వారికి అంత అనుకూలంగా లేదు. మానసిక సమస్యలు బాధిస్తాయి. వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. మీ ప్రణాళికలను, రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు. తప్పుడు వ్యక్తుల సలహాల వల్ల వ్యాపారంలో నష్టాలు రావచ్చు. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించండి.  మీ పాత తప్పులను అంగీకరించి, వాటిని సరిదిద్దటానికి ప్రయత్నం చేయండి. సహోద్యోగులతో మంచిగా మసలుకోండి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

కుంభం

ఈరోజు కుంభ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులు పైఅధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో మాటపట్టింపులు వస్తాయి. అనారోగ్య సమస్యలు. పెళ్లి  చర్చలు సఫలమవుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీనం 

ఈరోజు మీన రాశి వారికి కుటుంబ వ్యక్తులతో అనవసర విషయాల్లో  విభేదాలు తలెత్తే అవకాశముంది. మీది కాని విషయాల్లో తల దూర్చకండి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు పనివిషయంలో అశ్రద్ధ చూపవద్దు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచన వాయిదా వేసుకోవడమే మంచిది.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొన్నివ్యవహారాలలో పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు వెళ్ళడం మంచిది. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.