Today Horoscope : ఆగస్టు 16 బుధవారం రాశి ఫలితాలు.. వారు వాహన వినియోగంలో జాగ్రత్త వహించాలి

Today Horoscope : ఈరోజు మేషరాశి వారికి వ్యాపారంలో కొంత ఆటంకాలు ఏర్పడుతాయి. ఆవేశానికి గురికాకూడదు. ఇతరులతో ప్రశాంతంగా మాట్లాడాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి.  

  • Written By:
  • Publish Date - August 16, 2023 / 07:41 AM IST

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారికి వ్యాపారంలో కొంత ఆటంకాలు ఏర్పడుతాయి. ఆవేశానికి గురికాకూడదు. ఇతరులతో ప్రశాంతంగా మాట్లాడాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి.  ఒత్తిళ్ళు పనికిరావు. పనుల విషయంలో వాయిదా పనికిరాదు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకున్నవారు ప్రయత్నాలు ప్రారంభించండి. కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు ఈ రోజు మంచిరోజు. సంకటనాశన గణపతి స్తోత్రం, విఘ్నేశ్వర అప్టోత్తర శతనామావళి పఠించాలి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారు  అనవసర చర్చలకు దూరంగా ఉండడమే మంచిది. ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించవద్దు. కుటుంబంలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. పరిష్కరించేదిశగా అడుగేయండి.  ఉద్యోగులు..  సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. ధనలాభం సూచితం. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి.

Also read : VishwakSen : ఆహాలో మాస్ కా దాస్.. ఫ్యామిలీ ధమాకా.. యాంకర్ గా మారనున్న హీరో..

మిథునం

ఈరోజు మిథునరాశి వారు వాహన వినియోగంలో జాగ్రత్త వహించాలి. ఓ నిర్దిష్ఠమైన పని పూర్తిచేయలేకపోవడం వల్ల మీరు కలత చెందుతారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. నూతన పెట్టుబడులు పెట్టేవారు అనుభవజ్ఞుల సలహాలను స్వీకరించడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.  ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు ఉన్నా మంచి ఫలితం వస్తుంది. మహావిష్ణువును పూజించాలి.

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారు ధనమును జాగ్రత్తగా ఖర్చుచేయాలని సూచన. ధనలాభం ఉంది.  ఉద్యోగస్తులు ఉద్యోగంలో పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  మీయొక్క తెలివితేటలను సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం చదవడం, వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహం

ఈరోజు సింహరాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి. ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యలను అధిగమించండి. మీకు ఎవరితోనైనా విభేదాలుంటే అవి తొలగిపోతాయి. నూతన ఒప్పందాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. నూతన వాహనం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు. ముఖ్య పనుల్లో శ్రద్ధ వహించండి.ఉద్యోగస్తులకు అనుకూలం. వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్చించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

Also read : Bindeshwar Pathak: సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ సంపద ఎంతంటే..?

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారికి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. న్యాయపరమైన వ్యవహారాల్లో మీరు నష్టపోతారు. వ్యాపారంలో పెద్దగా రిస్క్ తీసుకోవద్దు. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. మీరు చేసే పనుల్లో సమయస్ఫూర్తి కాపాడుతుంది. ఏ విషయం గురించీ ఎక్కువగా ఆలోచించవద్దు.సమస్యలు, ఇబ్బందులు తొలగుతాయి. భగవద్గీత వినడం, చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తుల

ఈరోజు తులారాశి వారు విచారకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వ్యాపారులు నష్టపోతారు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు నష్టపోయే అవకాశం ఉంది. అపార్థాలకు దూరంగా ఉండండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మహావిష్ణువును పూజించాలి. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారు కుటుంబంలో శుభ కార్యం జరిపేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబసభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆలోచనాత్మకంగా చేసేపనులు పూర్తవుతాయి. ఎవరు ఏమన్నా మీరు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగాలి. ప్రత్యేక వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది.  వ్యాపారస్తులకు వ్యాపారంలో జాగ్రత్త అవసరం. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారు ఇతరులపై ఆధారపడవద్దు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్నేహితులు, బంధువుల నుంచి ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. పలు మార్గాల్లో అభివృద్ధి ఉంటుంది. వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్చించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

Also read : Corn silk: వామ్మో.. మొక్కజొన్న పీచు వల్ల అన్ని రకాల లాభాలా?

మకరం

ఈరోజు మకర రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి. వ్యాపారంలో నష్టం ఎదుర్కొంటారు. వ్యాపారంలో ఆటంకాలు ఉన్నా మిత్రుల సహాయంతో కొనసాగించాలి. కుటుంబంలో అనూహ్యకరమైన ఓ సంఘటన జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు. కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉన్నా ప్రశాంతంగా ఉండాలని సూచన.  ఎవ్వరికీ పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వొద్దు.  అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్చించాలి.

కుంభం

ఈరోజు కుంభ రాశి వారిని ఇల్లు, కుటుంబం, వ్యాపారం గురించి ఏదో ఆందోళన వెంటాడుతుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనాల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి.  ప్రత్యర్థులు ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారంలో నష్టాలుంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించే ముందు మీ ఆత్మీయుల సలహాలు తీసుకోండి. ఎదురు చూస్తున్న ఒక  పని పూర్తవుతుంది. మహావిష్ణువును పూజించాలి.

మీనం 

ఈరోజు మీన రాశిలోని వ్యాపారులకు పెద్ద కాంట్రాక్ట్ కుదురుతుంది. నూతన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేస్తారు. శుభవార్త వింటారు. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.