Site icon HashtagU Telugu

ASSOCHAM : అసోచామ్, తెలంగాణ ప్రభుత్వం ఏఐ & సెక్యూరిటీ సదస్సు

Assocham, Telangana Govt AI & Security Conference

Assocham, Telangana Govt AI & Security Conference

ASSOCHAM : అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), తెలంగాణ ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ (IT,E&C) శాఖ సహకారంతో టి హాబ్ యొక్క సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ (CoE), MATH, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DSCI); మరియు ISACA లు “ఇన్నోవేషన్ నెక్సస్ – కాన్ఫరెన్స్ ఆన్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ & AI”ని HICC, నోవాటెల్, హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించింది. సాంకేతిక పురోగతులు, పరిశ్రమలు మరియు సమాజాన్ని ఎలా పునర్నిర్మిస్తున్నాయనే దానిపై పరిజ్ఞానం అందించడానికి, కృత్రిమ మేధస్సు (AI), ముఖ్యంగా ఉత్పాదక AI నమూనాలు మరియు వాటి వినియోగం లో అభివృద్ధి చెందుతున్న ధోరణులను అన్వేషించడానికి ఈ సమావేశం ఒక వేదికగా ఉపయోగపడింది. జెన్ AI యుగంలో డేటా రక్షణ, గోప్యతపై దృష్టి కేంద్రీకరించిన కీలక సెషన్‌లు, నేటి డిజిటల్ వాతావరణం లో అవసరమైన ఉత్తమ పద్ధతులు, నియంత్రణ కార్యాచరణ పద్ధతులను వెల్లడించాయి.

Read Also: Threat To Shinde: కారును బాంబుతో పేల్చేస్తాం.. డిప్యూటీ సీఎంకు హత్య బెదిరింపు

ఈ కార్యక్రమం లో తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు & వాణిజ్యం, IT, E&C డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ జయేష్ రంజన్, ఐఏఎస్ మాట్లాడుతూ.. పటిష్టమైన భద్రతా చర్యలు, గోప్యతా ప్రోటోకాల్‌లు మరియు నైతిక AI విస్తరణతో సాంకేతిక ఆవిష్కరణలను సమతుల్యం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున, AI యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ భద్రతా వ్యూహాలు మరియు డేటా రక్షణ విధానాలను నిరంతరం పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. జాతీయ భద్రత మరియు సైబర్ భద్రతపై గురించి జి నరేంద్ర నాథ్, ITS, జాయింట్ సెక్రటరీ, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ (NSCS), భారత ప్రభుత్వం, మాట్లాడారు. CtrlS & Cloud4C డైరెక్టర్-కంప్లయన్స్ చంద్ర శేఖర్ శర్మ గరిమెళ్ల, మరియు ISACA హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్, భద్రత మరియు క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై తన నైపుణ్యాన్ని పంచుకున్నారు. అసో చామ్ స్టేట్ హెడ్ – ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా దినేష్ బాబు మచ్చ మాట్లాడుతూ.. సదస్సుకు తమ విలువైన సహకారాన్ని అందించిన విశిష్ట వక్తలు, పరిశ్రమల ప్రముఖులు కు కృతజ్ఞతలు తెలిపారు. సురక్షితమైన డిజిటల్ భవిష్యత్తును నిర్ధారించడానికి సైబర్ భద్రత, డేటా గోప్యత మరియు AI యొక్క నైతిక విస్తరణపై నిరంతర సహకారం యొక్క అవసరాన్ని ఆయన వెల్లడించారు.

Read Also: Pawan Kalyan : కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోంది: పవన్‌ కల్యాణ్