Pahalgam Terror Attack : ఏపీ ప్రభుత్వం పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. విశాఖపట్నానికి చెందిన జె.డి. చంద్రమౌళి, కావలికి చెందిన ఐటి ఉద్యోగి మధుసూదన్ అనే ఇద్దరు వ్యక్తులు పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందారు. వారి కుటుంబాలకు సీఎం చంద్రబాబు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి జె.ఎస్. చంద్రమౌళి భౌతికకాయాన్నిచంద్రబాబు నివాళులర్పించారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విశాఖ వెళ్లిన ఆయన చంద్రమౌళి భౌతికకాయంపైపై జాతీయ జెండా కప్పారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
Read Also: Shimla Agreement : ‘సిమ్లా ఒప్పందం’ నుంచి పాక్ వైదొలిగే ఛాన్స్.. ఏమిటిది ?
జమ్మూ ఉగ్రదాడి నేపథ్యంలో విశాలమైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్ర భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. పోలీస్ వ్యవస్థను సమర్ధవంతంగా నడిపిస్తాం. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్తామని చెప్పారు. దేశ సమగ్రత, భద్రతను దెబ్బతీయాలని చూసే వారి ఆటలు సాగవని సీఎం చంద్రబాబు అన్నారు. ఉగ్రవాదులు భారత్ ను ఏం చేయలేరు. మన దేశంలో సమర్థనాయకత్వం, సుస్థిర ప్రభుత్వం ఉందన్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ భారత పర్యటనలో ఉండటం, దేశ ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన ఈ దాడి వెనుక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు పహల్గాం ఉగ్రదాడిలోని బాధిత కుటుంబాలకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వా రికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది.
Read Also: Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. సైనికుడి మృతి