Poonam Pandey : బాలీవుడ్ హాట్ బాంబ్ 32 ఏళ్ల నటి పూనమ్ పాండే(Poonam Pandey) కన్నుమూసింది. దీంతో సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సర్వికల్ క్యాన్సర్ బారినపడి చికిత్స తీసుకుంటున్న ఆమె.. ఆరోగ్యం విషమించి శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పూనమ్ పాండే మేనేజర్ ఆమె ఇన్ స్టా ఖాతా వేదికగా వెల్లడించారు. దీంతో సినీ ప్రముఖుల నుంచి ఆమెకు సంతాపం వెల్లువెత్తుతోంది. పూనమ్ పాండే మరణ వార్తలపై నెటిజన్ల నడుమ పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇది నిజమేనా? పబ్లిసిటీ స్టంటా? అని కొందరు అనుమానిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటుంది. ఆమె చేసే ఫోటో షూట్లు, షేర్ చేసే వీడియోలు ఎంత అశ్లీలంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎక్కువగా అడల్ట్ కంటెంట్‌ను చేసేందుకే పూనమ్ పాండే మొగ్గు చూపించినట్టుగా కనిపిస్తుంటుంది. ఆమె ఎప్పుడూ 18 ప్లస్ కంటెంట్‌ను మాత్రమే ప్రమోట్ చేస్తుండేది. అలా ఆమె ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఇక ఆమె సపరేట్‌గా ఓ యాప్ ద్వారా కూడా తన అందాలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తుండేది. ఇండియా వరల్డ్ కప్ కొడితే బీచ్‌లో నగ్నంగా తిరుగుతానని పూనమ్ పాండే ప్రకటించి.. దేశ వ్యాప్తంగా దుమారం రేపింది.
Also Read : 11 Crore Donations : అయోధ్యకు 10 రోజుల్లో 11 కోట్ల విరాళం.. దర్శించుకున్న 25 లక్షల మంది
మోడల్‌గా కెరీర్ ఆరంభించిన పూనమ్ 2013లో ‘నషా’ మూవీతో బాలీవుడ్‌లో తెరంగ్రేటం చేసింది. పలు హిందీ సినిమాల్లో నటించిన ఆమె.. ప్రముఖ నటి కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరించిన లాకప్ తొలి సీజన్‌లో పాల్గొంది. 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీ సందర్భంగా చేసిన ఓ ప్రకటనతో పూనమ్ చాలా పాపులర్ అయ్యింది. ఆమె వైవాహిక జీవితం కూడా వివాదాస్పదమైంది. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ అప్పట్లో పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. మొత్తం మీద వివిధ వివాదాలు, అశ్లీల కంటెంట్, సినిమాల్లో యాక్షన్‌ల మేళవింపుగా ఆమె కెరీర్ సాగింది. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టుల వల్ల ఆమె పేరు ఫేమసైంది. ఏదిఏమైనప్పటికీ ఆమె మరణం పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.