హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గాయపడ్డారు. ఆయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ‘NBK 111’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుచుకుంటున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సెట్స్‌లో బాలయ్య గాయపడటంతో షూటింగ్‌కు బ్రేక్ పడినట్లు వార్తలు వస్తున్నాయి.
‘NBK 111’ మూవీ షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్ట్‌లో జరుగుతోంది. బాలకృష్ణ, మంచు మనోజ్ మధ్య ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది. ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు బాలయ్య జారిపడటంతో, ఆయన మోకాలికి దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ షూటింగ్‌ను నిలిపివేసి, బాలకృష్ణను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారట. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మోకాలికి స్కానింగ్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన కాకినాడ పోర్ట్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
‘NBK 111’ అనేది 1993 బాంబే నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని టాక్. ఇందులో బాలయ్య గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో కనిపిస్తారని సమాచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ‘వీర సింహారెడ్డి’ తర్వాత బాలయ్య – గోపీచంద్ కలయికలో రానున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగులు రాస్తున్నారు. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, రవివర్మ, వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా 2027 సంక్రాంతి సీజన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
