SLBC : 22 రోజులైనా దొరకని కార్మికుల జాడ..ఆశలు వదులుకోవాల్సిందేనా..?

SLBC : సుమారు నాలుగు మానవ అవశేషాలు ఉన్నట్లు GPR (గ్రౌండ్ పెనీట్రేటింగ్ రాడార్) స్కానర్ గుర్తించినా, అక్కడ విస్తృతంగా తవ్వకాలు జరిపినప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు

Published By: HashtagU Telugu Desk
SLBC

SLBC

తెలంగాణలోని ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ, వారి ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం కలకలం రేపుతోంది. 22 రోజులుగా రెస్క్యూ టీమ్‌లు అన్ని విధాలుగా శ్రమిస్తున్నా, ఫలితం మాత్రం కనిపించడం లేదు. రోబో సహాయంతో లిక్విడ్ రింగ్ వాక్యూమ్ ట్యాంక్ యంత్రాన్ని వినియోగించి కార్మికుల జాడ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఒక్క మృతదేహం మాత్రమే వెలికితీయగలిగారు.

AP & TG Temperatures : తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఎండ తీవ్రత

సుమారు నాలుగు మానవ అవశేషాలు ఉన్నట్లు GPR (గ్రౌండ్ పెనీట్రేటింగ్ రాడార్) స్కానర్ గుర్తించినా, అక్కడ విస్తృతంగా తవ్వకాలు జరిపినప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. దీంతో అధికారులు తాత్కాలికంగా ఆ ప్రాంతంలో తవ్వకాలను నిలిపివేశారు. ప్రస్తుతం హై రిస్క్ ఏరియాగా భావిస్తున్న D-1 ప్రాంతంలో తవ్వకాలు జరపాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సిన అవసరం ఉన్నందున, సహాయక చర్యలకు మరింత సమయం పట్టే అవకాశముంది.

Pawan Kalyan : హిందీ భాష పై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

చిక్కుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు గుండెల్లో వేదనతో ఎదురు చూస్తున్నారు. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ వారికి ఆశలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం, రెస్క్యూ బృందాలు తమ శక్తిమేరకు సహాయక చర్యలు చేపడుతున్నా, ఇప్పటివరకు ఆశాజనకమైన ఫలితాలు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరికొన్ని రోజుల్లో గాలింపు చర్యలు ఎటువంటి దిశలోకి వెళ్లబోతాయో చూడాలి.

  Last Updated: 15 Mar 2025, 09:06 PM IST