Site icon HashtagU Telugu

Stree Summit : మహిళా సాధికారత కోసమే స్త్రీ సమ్మిట్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Women Summit is for women's empowerment: Deputy CM Bhatti Vikramarka

Women Summit is for women's empowerment: Deputy CM Bhatti Vikramarka

Stree Summit :  హైదరాబాద్ తాజ్ డక్కన్ హోటల్ లో నిర్వహించిన స్త్రీ సమ్మిట్ 2.0 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మార్చి 8 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం), ఏప్రిల్ 14 (డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి) తేదీలను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. అంబేద్కర్ మహిళలకు అనేక హక్కులు కల్పించారని, మహిళలను శక్తిగా, దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మన దేశానికి ఉందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యమని అని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. గ్రీన్ ఎనర్జీ రంగంలో తెరంగాణ మహిళలను భాగస్వామ్యం చేస్తున్నామని, 1000 మెగావాట్ల పునరుత్పత్తి విద్యుత్ ఉత్పత్తికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తో కలిసి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

Read Also: Salman Khan : సల్మాన్‌ఖాన్‌‌కు బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి దొరికాడు.. అయితే !!

మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి రూ. 21,000 కోట్లు విలువైన వడ్డీ లేని రుణాలు మహిళలకు అందుతుండటం విశేషమని చెప్పారు. మహిళల హక్కుల కోసం పార్లమెంట్‌లో అనేక బిల్లులు రూపొందించబడ్డాయని, ఈ దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా శక్తి క్యాంటీన్స్, ఆర్టీసీతో కలిసి మహిళలు భాగస్వామ్యం అవడం, స్థానిక సంస్థలలో 33% రిజర్వేషన్లు వంటి పలు చర్యల ద్వారా మహిళలు తమ పాదాలపై నిలబడేందుకు అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. వడ్డీలేని రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశం లభించిందని అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుకు ఫ్రీ లోన్లు ఇస్తున్నామని చెప్పారు. స్వయం సహాయక గ్రూపులకు రూ.20 వేల కోట్లకు పైగా లోన్లు ఇస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం మహిళలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు మహిళా సాధికారత కోసమే స్త్రీ సమ్మిట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడారు. మహిళా భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. షీ టీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని 7 జోన్లలో 7 మహిళా పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. ప్రస్తుతం నగరంలో 8 మంది మహిళా డీసీపీలు పని చేస్తున్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

Read Also: Telangana : త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టులు భర్తీ: సజ్జనార్