ఈ నెల 14న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే (MLA)కు అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ మహిళా (Woman Video Call) ఓ వీడియో కాల్ చేయడం..ఆ కాల్ లెఫ్ట్ చేయగానే, మహిళ నగ్నంగా కనిపించడం చూసి షాక్ తో వెంటనే కాల్ కట్ చేసాడు. ఇటీవల కొంతమంది మహిళలు రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. నేతలతో చనువు పెంచుకోవడం..ఆ తర్వాత వారితో శారీరక సంబంధాలు ఏర్పరచుకోవడం..ఇద్దరు ఏకాంతగా ఉన్న సమయంలో సదరు నేతకు తెలియకుండా వీడియో తీసి బెదిరింపులకు పాల్పడడం చేస్తున్నారు. గత కొద్దీ రోజుల్లుగా ఏపీలో ఇలాంటి వ్యవహారాలే వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా ఇప్పుడు తెలంగాణ లో ఇదే తరహా వీడియో కాల్ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియోకాల్ రావడం తో.. ఆ వీడియో కాల్‌ను ఎమ్మెల్యే లిఫ్ట్ చేసాడు. అంతే.. ఫోన్ తెరపై ఓ మహిళ నగ్నంగా కనిపించడంతో షాక్ కు గురై వెంటనే కాల్ కట్ చేసాడు. తనను కావాలనే వివాదంలో ఇరికించడానికి ఇలా న్యూడ్ కాల్ చేసినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించి, నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే గురువారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) లో కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల ఓ మహిళకు సైబర్ నేరస్థులు వీడియో కాల్ చేసి తాము సీబీఐ పోలీసులు అని, మీ భర్త, కుమారుడిని డ్రగ్, మనీలాండరింగ్ కేసులో ‘నాన్-బెయిల్ వారెంట్’పై అరెస్టు చేశామని నమ్మించారు. వారిని కేసు నుంచి తప్పించాలన్నా ఇంటికి పంపాలన్నా వెంటనే రూ.50 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మొదట ఇదంతా నమ్మిన ఆ మహిళ వారి వ్యవహార శైలిపై అనుమానం వచ్చి వెంటనే తన భర్తకు కాల్ చేయగా మోసమని గ్రహించింది. మోసం చేయడానికి ఇదో రకమైన వీడియో కాల్ అయితే మరో రకంగా న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ కూడా బెదిరింపులకు పాల్పడి భారీగా దోచుకుంటున్నారు.
Read Also : Edible gold: మీరు బంగారాన్ని ఎప్పుడైనా తిన్నారా.. తినే బంగారం ఎలా తయారు చేస్తారో తెలుసా..?