KTR : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రతి పనిలోనూ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారు. కేంద్రం తీరుపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు.
Read Also: Liver: మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ డ్రింక్స్ తప్పనిసరిగా తాగాల్సిందే?
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రథకాలను కేంద్రం అనుకరిస్తోంది. మనకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణకు మేలు జరగాలి. రాష్ట్ర ప్రజలు బాగుండాలి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. రాష్ట్రం బాగుండాలన్నదే మా సంకల్పం. పదవులు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడకపోవడం బాధేసింది.
కేంద్రం తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా? సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి. కుంభమేళాకు నిధులు ఇస్తున్న కేంద్రం.. సమ్మక్క-సారలమ్మ జాతరకు ఎందుకు ఇవ్వదు? అని కేటీఆర్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఒక్క సీటు కూడా రాలేదని విమర్శిస్తున్నారు. మాకు వచ్చింది సున్నానే.. మరి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకి వచ్చింది గుండు సున్నా కాదా. కొట్లాడకపోతే కేంద్రం నిధులు ఇవ్వదు… పోరాడాల్సిందే. కేంద్రంతో గట్టిగా మాట్లాడేందుకు మేం కూడా మద్దతిస్తాం. సత్సంబంధాలు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. మేం కూడా అప్పట్లో కేంద్రంతో సఖ్యతతోనే ఉన్నాం. ఏమీ రాలేదు అని కేటీఆర్ అన్నారు.