Revanth Reddy : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాలలో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. 11 ఏళ్లలో మోడీకి రాష్ట్రానికి రెండు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఒకటి కిషన్‌రెడ్డికి.. మరొకటి బండి సంజయ్‌కు. వీరికి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చారా? ఇన్ని వేలమందికి ఉద్యోగాలు ఇవ్వని బీజేపీకి ఓటు అడిగే హక్కు ఎక్కడిది?. పెట్టుబడులతో పట్టభద్రులకు ఉద్యోగాలు వచ్చే అవకాశముందన్నారు. ఏడాది కాలంలో భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. చీకటి ఒప్పందంలో భాగంగా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు.
Read Also: KCR : ఫామ్ హౌస్లో కూర్చుని కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడు – సీఎం రేవంత్
తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి వారు సాధించిందేటని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక 55వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. 11 ఏళ్ల మోడీ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు? 2014, 2019 ఎన్నికల ప్రచారంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని చెప్పారు. ఆ లెక్కన 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. గత పదేళ్లలో ఏనాడైనా కేసీఆర్ మహిళా స్వయం సహాయక సంఘాలను పట్టించుకున్నారా..? అని ప్రశ్నించారు.
మేము బీఆర్ఎస్ స్కామ్ ల మీద కేసులు పెడితే ఈడీ పేపర్లను లాక్కెళ్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రహస్య ఎజెండా ఏంటి అని ప్రశ్నించారు. వీళ్ల కుట్రలను ప్రజలు గమనించి.. మీ బిడ్డలను కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేయించి గెలిపించాలని కోరారు. మా ప్రభుత్వం వచ్చాక మొత్తం 55,163 మందికి ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామకపత్రాలు అందజేశాం. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు టెట్ నిర్వహించాం. 11 వేల మంది టీచర్ల నియామకం చేపట్టాం. పోలీసుశాఖలో 15 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 6వేలకు పైగా పారామెడికల్ సిబ్బందిని నియమించాం. నేను చెప్పింది అబద్ధమైతే మాకు ఓటు వేయొద్దు. నిజమని నమ్మితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించండి అని రేవంత్‌రెడ్డి అన్నారు.